Thursday, September 5, 2013
గురు బ్రహ్మ ! గురు విష్ణు !! గురు దేవో మహేశ్వరః !!! గురు సాక్షాత్ పరబ్రహ్మ ! తస్మైత్ శ్రీ గురవేన్నమః !!!
మన ధ్యేయము త్వరగా ఫలించే మార్గము ఏదంటే, వెంటనే భగవంతుని సాక్షాత్కారము పొందిన సద్గురువు దగ్గరికి వెళ్ళటం అధ్యాత్మిక ఉపన్యాసాలు ఎన్ని విన్నప్పటికీ పొందనటువంటిదీ, అధ్యాత్మికగ్రంథాలు ఎన్ని చదివినా తెలియనటువంటిది ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముతో పొందవచ్చు. నక్షత్రములు అన్నీ కలిసి యివ్వలేని వెలుతురును సూర్యుడు ఎలా ఇవ్వగలుగుతున్నాడో అలాగే ఆధ్యాత్మిక ఉపన్యాసములు, గ్రంథములు యివ్వలేని జ్ఞాన్నాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధాలు. శాంతి, క్షమా, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహాలను స్వాధీనంలో ఉంచుకోవటం, అహంకారం లేకుండా ఉండటం మొదలైన శుభలక్షణాలను వారి ఆచరణలో చూచి, భక్తులు నేర్చుకుంటారు. వారి పావనచరితములు భక్తుల మనసులకు ప్రబోధము కలగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరిస్తుంది. సాయిబాబా అలాంటి మహాపురుషుడు, సద్గురువు
No comments:
Post a Comment