Monday, August 19, 2013

సద్గురు సాయినాథునికి శతకోటి వందనాలు ....


జీవితంలో అనుక్షణం ఏవో కష్టనష్టాలు ఎదురౌతుంటాయి. అందుకే సంసారాన్ని సాగరంతో పోల్చారు. నిరంతర అలల తాకిడిని పోలిన చీకూచింతలు ఉంటాయి. ఆటుపోట్ల సమస్యలు వస్తుంటాయి. తిమింగలాల్లాంటి పెద్ద ఆపదలు పొంచి ఉంటాయి. తుపానుల్లాంటి ఆకస్మిక ప్రళయాలు ముంచుకొస్తుంటాయి.
అంతమాత్రాన జీవితం నుండి పారిపోలేం. పలాయనవాదం పనికిరాదు. ఇలాంటి ఆపద సమయాల్లో భక్తులు సాయిబాబాను స్మరించుకుంటారు. బాబా భక్తసులభుడు. వెంటనే అనుగ్రహిస్తాడు. నమ్మినవారికి అండగా నిలుస్తాడు. కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. కష్టాలనుండి గట్టెక్కిస్తాడు.
ఆపదల నుండి బయటపడిన భక్తులకు బాబా పట్ల ఎనలేని విశ్వాసం కుదురుకుంటుంది. ఇక మనసునే మందిరంగా చేసుకుని బాబాను ప్రతిష్టించుకుంటారు. సాయిబాబా లేని ప్రదేశం లేదు. అడుగడుగునా బాబా లీలలు కనిపిస్తాయి. అణువణువునా బాబా రూపం అనుభూతికొస్తుంది. అందుకే బాబా మనతోనే ఉన్నాడని నమ్ముతూ ముందుకు సాగాలి. ఆయన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తాడు. సమస్యలను పరిష్కరించుకునే తెలివితేటలు ఇస్తాడు. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ప్రసాదిస్తాడు. అన్నిటినీ మించి ప్రశాంత చిత్తాన్ని ఇస్తాడు. ఇంతగా మనల్ని కనిపెట్టుకుని ఉండే సాయినాథునికి శతకోటి వందనాలు.

No comments:

Post a Comment