Friday, July 26, 2013

సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీనరసింహ రాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషీగోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


దోచౌపాతీదేవ లక్ష్మీ ఘన సంఖ్యా భోదిత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్త మంగళరూప
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


ఈ సిద్ధమంగళ స్తోత్రమును మూడు కాలముల యందు పఠించిన వారికి
అవధూతలు,సిద్ధపురుషుల దర్శనభాగ్యం కలుగుతుందని శ్రీపాదుల వారే స్వయంగా తెలియజేసారు..

కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః

కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు
ద్వాపర యుగములో కృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు
అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలోప్రస్తావించారు.

శ్రీపాద శ్రీవల్లభులు కలియుగములో ప్రప్రధమ దత్తాత్రేయ అవతారం.తరువాత ఈ గురువు గారు
శ్రీ నృసింహ సరస్వతి యతీంద్రులుగాను,శ్రీ మాణిక్య ప్రభువుగాను, స్వామి సమర్ధుల గాను,శిరిడీ సాయి బాబా గాను
షేగాఁ శ్రీ గజానన్ మహరాజ్ గాను,శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబాగాను అవతరించారు.భగవంతుని అన్ని అవతారాలు అవతారకార్యం ముగియగానే మూలంలో నిక్షిప్తమౌతాయి.కానీ దత్తావతార విశిష్టత ఏమిటంటే ఈ అవతారం కృత యుగం నుండి కలియుగం వరకూ ప్రతి యుగంలోనూ ఉంటుంది.ప్రతి యుగంలోనూ ఒక లక్షా ఇరవై ఐదు వేల మంది అవధూత మహాత్ముల్ని తయారుచేస్తూనే ఉంటానని అని దత్త ప్రభువులు వాగ్ధానం చేసివున్నారు.దత్త సంప్రదాయమైన గురు పరంపర ప్రతి మతంలోనూ కనిపిస్తుంది. 

స్వామి వారి జన్మస్థలం: తూర్పుగోదావరి జిల్లా శ్రీ సత్యనారాయణ స్వామి వారు కొలువై వున్న అన్నవరం పట్టణానికి
30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం అని పిలవబడుతున్న శ్రీ పీఠికాపురం అనే పట్టణంలో జన్మించారు.అక్కడ
16 సంవత్సరాలు నివశించి,ఆ తర్వాత కృష్ణా నది తీరంలో ఉన్న కురువపురం/కురుగడ్డ లేదా కురుంగడ్డ చేరుకుని అక్కడ
14 సంవత్సరములు తపస్సు చేసి కృష్ణా నదిలో అంతర్హితమయ్యారు.వీరి చరిత్ర శ్రీమాన్ శంకరభట్టుగారు సంస్కృతంలో రచించారు, మల్లాది గోవింద దీక్షితుల వారు తెలుగు ప్రతిని మనకందించారు..

లార్డ్ దత్తాత్రేయ స్పిరిచ్యువల్ సొసైటీ
డోర్ నం: 14-1-37
వంగల వారి వీధి,శ్రీ క్షేత్ర పిఠాపురం - 533450
తూర్పు గోదావరి జిల్లా.ఆంధ్ర ప్రదేశ్.
ఫోన్ : 08829-250299,9247637526

ఇక్కడ భోజన,వసతి సౌకర్యాలు ఉచితం.ఈ పట్టణ విశిష్టత ఏమిటంటే ఇక్కడ 1.కుంతీ మాధవ ఆలయము.
2.పురుహూతికా మాత శక్తి పీఠం 3.కాలాగ్ని శమన దత్తుని ఆలయం(శ్రీ దత్తత్రేయుల వారి స్వయంభూ విగ్రహం) 4.కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం(జ్యోతిర్లింగం) ,5.పాద గయ క్షేత్రం ఉన్నాయి.(శక్తి పీఠం,పాద గయ,జ్యోతిర్లింగం,కాలాగ్ని శమన దత్త మందిరం ఒకే ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి)

* అవధూత మహాత్ములు శ్రీ గోపాల్ బాబా గారి ఆశ్రమంలో వారి దర్శనం చేసుకోవచ్చు.వారి అన్నదాన సత్రంలో ఉచిత భోజన వసతి సౌకర్యం ఉంది.
శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం సప్తాహ(వారం రోజులు) పారయణ చేసి,అదే నెలలో వచ్చే అష్టమి నాడు అనఘాష్టమి వ్రతం చేసుకుని పదకొండు మందికి
భోజనం పెట్టినా లేదా తత్సమానమైన ధనం గుడిలో అన్నదానానికి దక్షిణ ఇచ్చినా అయన కృపకి పాత్రులవుతారని స్వామివారు తెలియజేశారు.
అనఘాష్టమి వ్రతం అదే పట్టణంలో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వాములు వారిచే నిర్మింపబడిన అనఘాసమేత దత్తాత్రేయుల వారి
ఆలయంలో చేయించుకోవచ్చు.
ఫోన్ : 9866155899

శ్రీపాద శ్రీ వల్లభుల వారి మహా సంస్థానం గురించిన
వివరాలకు:
SRIPADA SRIVALLABHA MAHA SAMSTANAM
(Regd. No.678 of 1998)
Venugopalaswamy Temple Street,
PITHAPURAM - 533 450, E.G.Dist. A.P., India.
Office hours : 9-00 to 12-00 a.m. and 4-00 to 8-00 p.m.
Phone - (08869) 250300
Fax - (08869) 250900

కురువపురం వివరాలకు:
09448568183

3 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete