Wednesday, July 31, 2013

జీవితాన్ని నిరాడంబరంగా గడపాలి అన్న సాయి బాబా




జీవితాన్నినిరాడంబరంగాగడపాలి అన్న సాయి బాబా

పుట్టినవారు గిట్టకమానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే, చావుపుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. తోటివారితో వీలైనంత వినయవిధేయతలతో మాట్లాడాలి. జలసాలు, విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి. ఇలా బాబా చెప్పిన సూక్తులను గుర్తు చేసుకుందాం.
''ఇంద్రియాలను అదుపులో ఉంచుకో
సౌశీల్యాన్ని, సౌజన్యాన్నిఅలవర్చుకో

ఎక్కువగా మాట్లాడకు
ఎదుటివారు చెప్పేది విను
సుఖదుఃఖాలనుసమానంగాస్వీకరించు
వంతులు, వాడులాతలు వద్దు
అహంకారాన్నివిడిచిపెట్టు
కోపతాపాలకుదూరంగాఉండు
దేనిమీదా ఇష్టాన్ని పెంచుకోకు
దేన్నీ ద్వేషించకు
మనోవికారాలకుదూరంగా
నిర్వికారంగాఉండటంఅలవర్చుకో
శ్రద్ధ, సబూరీలను సమర్పించు
ఇదే నిజమైన గురుదక్షిణ''
ఇవన్నీ సాయిబాబా సూక్తులు.ఆచరించేందుకు ప్రయత్నం చేద్దాం.

No comments:

Post a Comment