Monday, July 22, 2013

సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు - 6


సాయితో సాయి.బా.ని.. అనుభవాలు - 6
శ్రీ సాయి సచ్చరిత్రలో సాయి యిద్దరు విధ్యార్థులను ఎలా దీవించారో, వారు రీక్షలో విజయం సాధించేలా యెలాఅనుగ్రహించారో ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాము. బాబూ తెండూల్ కర్ జ్యోతిష్కులు చెప్పిన మాటలని విని
ఖిన్నుడయి వైద్య శాస్త్ర పరీక్షకు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నప్పుడు తన తల్లి ద్వారా బాబా ఆదేశాలను, ఆశీర్వచనాలనూ స్వీకరించి పరీక్షలో ఉ త్తీర్ణుడైన సంగతి మరియు న్యాయశాస్త్ర పరీక్షలో షేవడే అనే విద్యార్థి బాబా ఆశీర్వచనాల్తో విజయము సాథించిన విషయము మనందరికీ తెలిసినదే.
యిటువంటి సంఘటనలే నా జీవితములో కూడా జరిగినవి. విషయాలను మీకిప్పుడు తెలియపరుస్తాను.
అది 1990 సంవత్సరము అక్టోబరు నెల. భారత ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న శాఖాపరమైన పదోన్నతికిమద్రాసులో జరగబోయే పరీక్షలకు వెళ్ళినాను. పరీక్ష నాడు ఉదయము మానసిక ఆందోళనతో అక్కడ అతిధి గృహప్రాంగణములోని ఒక చెట్టుకింద కూర్చుని నా పరీక్షలో విజయాన్ని ప్రసాదించమని బాబాని వేడుకుంటూ, ఒకసందేశమును ప్రసాదించమని కళ్ళు మూసుకుని సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరవగా 45 అధ్యాయం 374 పేజీలోని వాక్యములు నాకు ధైర్యాన్ని ప్రసాదించాయి. వాక్యాలని నేను మీకిప్పుడు తెలియపర్తుస్తున్నాను. "ఇకపొమ్ము, నీవు క్షేమమును పొందెదవు, భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచెఒకటి దానము చేయుము. దాని వల్ల నీవు మేలు పొందెదవు. " వాక్యములు చదువుతున్న సమయములోచెట్టుమీద కోయల కూత నన్నాకర్షించినది. కోయిల తెల్లటి శరీరము, నల్లటి మెడ కలిగి ఉండి నాలో ఆశ్చర్యమునుకలిగించినది. శ్రీ సాయినాధులవారు తెల్లటి కోయిల రూపములో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నరని భావించాను. ఆధైర్యముతో పరీక్ష వ్రాసి ప్రధమ శ్రేణిలో విజయాన్ని సాధించాను.
మరలా 1997 సంవత్సరం అక్టోబరు నెల. తిరిగి శాఖా పరమైన పదోన్నతికోసము జరిగే పరీక్షకు బొంబాయిలోని మాప్రధాన కార్యాలయానికి వెళ్ళినాను. నాకు తక్కువ విద్యార్హత ఉన్నా, యెక్కువ సీనియరిటీ ఉండుట చేత, పరీక్షరాయడానికి అర్హత పొందినాను. కాని అక్కడికి వచ్చిన యితర అభ్యర్థులందరూ నా కన్న వయసులో చిన్నవారు, మరియు విద్యార్హతలు యెక్కువగా కలిగినవారు. వారితో నేను పోటీ చేయగలనా అనే భయంతో సాయీని ప్రార్థించి కళ్ళుమూసుకుని సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరిచాను. ఆశ్చర్యము 45 అధ్యాయము 374 పేజీ "ఇక పొమ్ము, నీవుక్షేమమును పొందెదవు, భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానముచేయుము. దాని వల్ల నీవు మేలు పొందెదవు."
అదే సమయములో శ్రీ సాయి ఒక పావురము రూపములో నేను కూర్చున్న టేబులు మీద వాలి మూడుసార్లు కూతకూసి నన్ను ఆశీర్వదించి యెగిరి వెళ్ళిపోయినారు. సంఘటనతో బాబా ఆశీర్వచనాలు ఉన్నాయనే ధైర్యముతో పరీక్షవ్రాసి తిరిగి విజయాన్ని సాధించాను.
రెండు సంఘటనలను తలచుకున్నప్పుడెల్లా సాయినాధులవారిపై ప్రేమతో వారి పాదాలను ముద్దు పెట్టుకుని నాకృతజ్ఞతలు యెల్లప్పుడూ తెలియచేసుకుంటున్నాను.
ప్రతీవారికి తమ తమ అనుభవాలు ఉంటాయని నాకు తెలుసు.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment