Wednesday, July 24, 2013

సాయితో సాయి బా ని స అనుభవాలు - 21

సాయితో సాయి బా ని అనుభవాలు - 21


శ్రీ రఘునాధ అన్నా సాహెబ్ ధబోల్కర్ గారు హేమాద్రి పంత్ గా ఎలా పెరుగాంచారో మన సాయి భక్తులందరికీ తెలుసు. శ్రీ రఘునాధ అన్నా సాహెబ్ ధబోల్కర్ గారిని శ్రీ సాయి హేమాద్రి పంత్ అని ఏవిధంగా పిలిచిన విషయము శ్రీ సాయి సచ్చరిత్ర 2 అధ్యాయములో విపులముగా చెప్పబడింది. సాయితో సా యి బా ని అనుభవాలు చదువుతున్న సాయి భక్తులందరికీ సాయి బానిస ఎవరూ, వారి అసలు పేరు ఏమిటి అనే సందేహాలు కలిగి ఉండవచ్చును. సందేహాలను నివృత్తి చేయడం నా ధర్మము అని భావించి శ్రీ సాయి నన్ను సాయి బా ని గా నామకరణం చేసిన సంఘటను తెలియపరుస్తాను.

నేను శ్రీమతి రావాడ వెంకట రమణమ్మ, శ్రీ రావాడ వెంకట రావు పుణ్య దంపతులకు 24.04.1946 నాడుజన్మించాను. నా తల్లి తండ్రులు నాకు రావాడ గోపాలరావుగా నామకరణం చేసినారు. మాది భారద్వాజస గోత్రం. మరి 1989 సంవత్సరం జూలై నెలలో శ్రీ సాయి నన్ను షిరిడీకి రప్పించుకుని తన సేవలోనూ, సాయి భక్తుల సేవలోనూ, జీవించే అదృష్టాన్ని ప్రసాదించారు. విధంగా సాయి నాకు మరొక జన్మ ఇచ్చారు. రోజులు గడుస్తున్నాయి. 1995 సంవత్సరము తరువాత నేను శ్రీ సాయికి సర్వశ్య శరణాగతి చేశాను. 1995 సంవత్సరములో ఒక గురువారమునాడు తేదీ నాకు సరిగా గుర్తు లేదు, మా యింటికి దగ్గరలో ఉన్న శ్రీ సాయి మందిరానికి వెళ్ళినాను. శ్రీ సాయి తను తన భక్తులకు బానిస అని శ్రీ సాయి సచ్చరిత్రలో10 అధ్యాయములొ వివరంగా చెప్పి ఉన్నారు. మరి సాయినాధులవారు తన భక్తులకు బానిస అయినప్పుడు మరి నేను కూడా సాయి భక్తులకు బానిసనే కదా అనే భావనతో నన్ను బానిసగా స్వీకరించమని బాబాను వేడుకుంటూ వారి విగ్రహం ముందు ధ్యానము చేయసాగాను. వారి ధ్యానములో ఉండగా నాకెటువంటి దృశ్యము కనిపించలేదు. కాని నా పక్కన ఎవరో నిలబడి నా చెవిలో "నా బాధ్యతలు నిర్వర్తించే సన్యాసీ కళ్ళు తెరు". అన్న మాటలు విపడ్డాయి. ఒక్కసారిగా ఆశ్చర్యముతో కళ్ళు తెరిచి అన్నివైపులా చూసాను. ఎవరూ కనిపించలేదు. సాయినాధులవారు స్వయంగా మాటలు అన్నారని భావించి ఒక కాగితముపై సాయి బాధ్యతలు నిర్వర్తించే సన్యాసి అని వ్రాసుకున్నాను. ఇంకొక కాగితముపై సాయి కి బానిసని అని వ్రాసుకున్నాను. రెండు కాగితములను ఒకే పరిమాణములో మడతలు పెట్టి రెండు చీటీలను బాబా పాదాల వద్ద ఉంచి రెండిటిలోను ఒక చీటీని ప్రసాదించి నాకు నామకరణం చేయమని ప్రార్థించినాను. నేను కళ్ళు మూసుకుని రెండు చీటీలలో ఒకచీటీని తీసి తెరిచి చూసినాను. క్షణమునుండి శ్రీ సాయి నన్ను బాధ్యతలను నిర్వర్తించేసన్యాసీ అని పిలిచినారు అని భావించి సా యి బా ని గా సాయి బంధువులకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

సాయి .బా .ని . . తన ఆఖరి శ్వాస వరకు శ్రీ సాయి సేవలోనూ సాయి భక్తుల సేవలోనూ, తరించే భాగ్యాన్ని ప్రసాదించమనిశ్రీ షిరిడీ సాయినాధులవారినిప్రార్థిస్తున్నాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

1 comment: