సాయితో సాయి బా.ని.స. అనుభవాలు - 2
1991 లో నేను మా అమ్మాయికి వివాహానికి మంచి సంబంధ కోసం ప్రయత్నిస్తున్నాను కాని కుదరలేదు. ఎన్నోచోట్లకు తిరిగి , పెళ్ళికొడుకుల తల్లితండ్రులని అమ్మాయిని చూడమని మా యింటికి ఆహ్వానించాను. యెన్నో విథాలుగా అభ్యర్థించినప్పటికీ మా అమ్మాయిని చూడటానికి యెవరూ రాలేదు. 01.01.1992 న నూతన సంవత్సరమునాడు మా అమ్మాయి వివాహం గురించి శ్రీ షిరిడీ సాయిబాబావారిని సందేశం ఇమ్మని అడిగాను. కళ్ళు మూసుకుని శ్రీ పత్తి నారాయణరావుగారు రాసిన సచ్చరిత్రలోని ఒక పేజీ తెరిచాను. ఆశ్చర్యకరంగా అది 47 వ అధ్యాయం 387 పేజీ, అందులో ఇలా ఉంది "దీని గురించి చింత పెట్టుకోవద్దని నేనతనికి చెప్పాను, వరుడే ఆమెను వెతుక్కుంటు వస్తాడు". 1992 లో మా అమ్మాయి వివాహమవుతుందని సూచిస్తోందని తెలిసి నేను చాలా సంబర పడ్డాను. 1992 జనవరిలో నా స్నేహితుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి మా అమ్మాయి వివరాలు, జాతకం అడిగారు. వాటిని సామాజిక సేవకుడు వివాహ సంబధాలను కుది ర్చే తన స్నేహితుడు శ్రీ సోమయాజులుగారికి ఇస్తానని చెప్పినారు.. నిజానికి సోమయాజులుగారితో నా కంతగా పరిచయం లేదు.
17.02.1992 న నేను ఉదయం 9 గంటలకి ఆఫీసుకు వెళ్ళేటప్పటికి నా బల్ల మీద ఫోన్ మ్రోగసాగింది. నేను రిసీవరు తీసి అవతలినుండి యెవరు మాట్లాడుతున్నారని అడిగాను. “తను పెళ్ళికొడుకుననీ మీ అమ్మాయిని చూడటానికి విశాఖపట్నం నుంచి వచ్చానని “ సమాథానం చెప్పినాడు. నేను సందిగ్ధంలో పడి బాబాని ప్రార్థించాను. శ్రీ సాయిబాబాగారు ముందుకు వెళ్ళమని నాకు వెంటనే సలహా ఇచ్చారు. నేను వరుడుని అతని తల్లితండ్రులని మాయింటికి మధ్యాహ్ న్నం 2.30 కు ఆహ్వానించి మా అమ్మాయిని పరిచయం చేశాను. వారు మా అమ్మాయితో సుమారు గంట సేపు మాట్లాడిన తరువాత విశాఖపట్నం వెళ్ళిపోయారు. 19.02.1992 న పెళ్ళికొడుకు తండ్రి నుంచి, తమకి అమ్మాయి నచ్చిందని నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునేందుకు నన్ను, నా భార్యని రమ్మని టెలిగ్రాం ఇచ్చారు. మా అమ్మాయి అంగీకారం తీసుకుని 20.02.1992 న విశాఖపట్నం చేరుకున్నాము. సంబంధం ఖాయం చేసుకున్నాము. శ్రీ సాయి మా అమ్మాయికి మంచి వరుడిని ఇచ్చారని సంతోషించాను. వివాహం హైదరాబాదులో 10.05.1992 న ఉదయం 6.58 కి నిర్ణయమైంది. ఈ పెళ్ళి పనులన్ని సజావుగా సాగేలా సహాయం చేయమని, వివాహం బాగా జరిపించమనీ బాబాని ప్రార్థించాను. 22.03.1992 న మధ్యాహ్న్నం నిద్ర పోతున్నప్పుడు శ్రీ సాయిబాబా మా తండ్రిగారి రూపంలో (కీ.శే .ఆర్.వీ.రావు) దర్శనమిచ్చి మా అమ్మాయి వివాహానికి సహాయం చేస్తాననీ వివాహానికి కూడా వస్తానని మాటిచ్చారు. చనిపోయిన మనిషి (మాతండ్రిగారు) వివాహానికి వచ్చి ఏ విథంగా సహాయం చేయగలరు అని నేను ఆశ్చర్యపోయాను.
శ్రీ సాయి సచ్చరిత్రలో 40 అధ్యాయం 342 పేజీలొ శ్రీ సాయిబాబా ఇలా చెపుతారు "నన్నే గుర్తుంచుకొనువారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగా గాని, రైలుగాని విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి యొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను." శ్రీ సాయిబాబా మా తండ్రిగారి రూపంలోమా అమ్మాయిపెళ్ళికి. రాలేరనింపించింది. శ్రీ సాయి సచ్చరిత్ర 28 అధ్యాయం 240 పేజీలో శ్రీ సాయిబాబా అన్న మాటలు "నాకు ఏ రూపమూ ,ఆకారము అక్కరలేదు - నేను అంతటా ఉంటాను" సాయి సచ్చరిత్రలో 40వ అధ్యాయం 342 పేజీలో శ్రీ సాయి ఇలా అంటారు "నా మాటలు నిలబెట్టుకోవడానికి ప్రాణములనైన విడిచెదను. నా మాటలు నేనెప్పుడూ పొల్లు చేయను."
సాయిబాబాకి నేను పూర్తిగా సర్వశ్య శరణాగతి చేసి పెళ్ళి పనులు ప్రారంభించాను. 1992 మార్చ్ నెలలో శుభలేఖలు అచ్చువేయించి శ్రీ సాయి సూచించిన ప్రకారం మొదటి శుభలేఖ రాజస్థాన్ రణథంబార్ గణపతి మందిరానికి పోస్ట్ చెశాను. రెండవది తిరుపతి వేంకటేశ్వరస్వామికి, మూడవది షిరిడీలోని శ్రీ సాయిబాబా వారికి పంపించాను. తరువాత అయిదు శుభలేఖలు విదేశాలకు పంపి, కనీసం ఒక్క కుటుంబమైనా విదేశాన్నించి పెళ్ళికి వచ్చేలా చూడమని బాబాని ప్రార్థించాను. అమెరికానించి నా శ్రేయోభిలాషులు శ్రీమతి & శ్రీ వీ. సూర్యారావుగారు 09.05.1992 న మా అమ్మాయివివాహానికి హైదరాబాదు వచ్చినపుడు నేను ఆశ్చర్యపోయాను.
09.05.1992 న వివాహ మహోత్సవానికి సహాయం చేయమని అంతా బాగా జరిగేలా చూడమని బాబాని ప్రార్థించాను. ఆఖరికి 10.05.1992 పెళ్ళిరోజు వచ్చింది. ముహూర్తం ఉదయం 6 గంటల 58 నిమిషాలకు అవడంవల్ల ఉదయం నేను చాలా హడావిడిగా ఉన్నాను. శ్రీ సాయి సచ్చరిత్ర్త్ర పారాయణకి కనీసం అయిదు నిమిషాలు కూడా కేటాయించలేకపోయాను. ప్రతీరోజు సచ్చరిత్ర పారాయణకి నేను సమయం కేటాయించగలను అనే అహంకారం ఉండేది. ఆరోజు సచ్చరిత్ర ముట్టుకోలేనంతగా సాయి నన్ను బాగా పని వత్తిడిలో ఉండేలా చేసి నా అహంకారాన్ని తొలగించారు. పెళ్ళిలో నేను పూర్తిగా సాయిని మరచిపోయి నా స్నేహితులతోనూ, పెళ్ళికొడుకు బంధువులతోనూ మాట్లాడుతున్నాను. అప్పుడు ఉదయం 11.45 అయింది. పెళ్ళికొడుకు పురోహితుడు ఒక బ్రాహ్మడితో కూడా నా వద్దకు వచ్చి ఆ బ్రాహ్మడికి కొంత దక్షిణ యిమ్మని అడిగాడు. ఆ బ్రాహ్మడు అతని బంధువేమో అనుకుని రూ.21/- దక్షిణ ఇచ్చాను. అప్పుడు ఆబ్రాహ్మడు భోజనం పెట్టమన్నాడు. అపుడా పురోహితుడు అతనిని భోజన శాలలోకి పంపించి మిగతా అతిథులందరితోపాటు భోజనం చేయమని చెప్పాడు.. అతిథులతోను, బంధువులతోను మాట్లాడటానికి నేను భోజన శాలలోకి వెళ్ళినప్పుడు, నేను దక్షిణ ఇచ్చిన బ్రాహ్మడు నా వైపు చూసి నవ్వుతున్నాడు. అతను నన్నింకా డబ్బు అడుగుతాడేమోనని అనిపించి అక్కడినుండి వెళ్ళిపోయాను. పెళ్ళికొడుకు తరఫువారందరికీ అవసరమయిన పనులు చూడటంలో పుర్తిగా మునిగిపోయాను. సాయంతం 4.30 కి మగ పెళ్ళివారు పెళ్ళికుమార్తెను తీసుకుని విశాఖపట్నం బయలుదేరారు. సాయంత్రం 6.30 కి కూడా భోజనం చేయలేకపోయాను. కొంతమంది బంథువులతో భేదాభిప్రాయాలు రావడంవల్ల కొంచం కలతగా ఉన్నాను. ఆ భేదాభిప్రాయాల వల్ల రాత్రికూడా భోజనం చేయలేకపోయాను. ఉదయం ముహూర్తం అయిన తరువాత వివాహానికి అమెరికానించి వచ్చిన నా శ్రేయోభిలాషి శ్రీ వీ. సూర్యారావు గారు నాకు పలహారం ఇచ్చి " ఈ రోజు పని వత్తిడివల్ల నీకు భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు ఈ పలహారం తీసుకో" అని చెప్పారు. పలహారం చెయ్యకపోతే ఆరోజు నాకు ఉపవాసం అయిఉండేది. శ్రీ సాయి ఉపవాసానికి వ్యతిరేకి ఆయన తన భక్తులనెప్పుడూ ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు.(అధ్యాయం 32 పేజీ 274.) రాత్రి నేను నిద్రకుపక్రమించేముందు వివాహం చక్కగా జరిపించినందుకు శ్రీ సాయిని ప్రార్థించి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. శ్రీ సాయిబాబా వివాహానికి రాకుండా మాట తప్పారనిభావించాను..

22.03.1992 శ్రీ సాయి వివాహానికి వస్తానని మాటిచ్చారు. ఒకవేళ శ్రీ సాయిబాబా వివాహానికి వచ్చి ఉంటే ఏ రూపంలో వచ్చారు? నాకది ఒక ప్రశ్నఅయింది. నా సందేహాన్ని తీర్చమని శ్రీ సాయిని అడిగాను. శ్రీ సాయిబాబా నా కలలో బ్రాహ్మణుడి రూపంలో దర్శనమిచ్చి (నానుంచి 21/- రూపాయలు దక్షిణగా తీసుకున్న బ్రాహ్మణుడిగా) నవ్వుతున్నారు. నేను మంచం మీదనించి లేచి సాయి పటం ముందు నిలబడి మాట తప్పకుండా మా అమ్మాయి వివాహానికి విచ్చేసిన సాయిని గుర్తించ లేకపోయినందుకు నన్ను నేను నిందించుకున్నాను. మరునాడు నా అనుమానం సరిచూసుకోవడానికి, మగపెళ్ళివారి పురోహితుడిని నానుంచి 21/- దక్షిణ తీసుకున్న బ్రాహ్మణుడిని గురించి అడిగాను. ఆయన, ఆ బ్రాహ్మణుడు పెండ్లికి వచ్చిన అపరిచితుడని చెప్పారు. మరి ఆ అపరిచితుడు సాయి తప్ప మరెవరూ కాదనిపించింది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
No comments:
Post a Comment