బాబాతోసాయి బా ని స అనుభవాలు 13
సాయి సచ్చరిత్రలో శ్రీ సాయి 22, 42 వ. అధ్యాయాలలో సకల జీవరాసులలోనూ భగవంతుడిని చూడమని చెప్పినారు. లక్ష్మీ బాయిషిండే, ఒక రొట్టెముక్కనుపెట్టి ఆకలిని తీర్చిన శునక రూపంలో వచ్చింది తానేనని చెప్పారు. యెవరయితే ప్రాణులన్నిటిలోనూ తనని చూసి వాటి ఆకలిని తీరుస్తారో వారే తన నిజమైన భక్తులని చెప్పారు. ఆయన చెప్పిన బోధనలు సత్యమని నిరూపించేందుకు నాకు కూడా రెండు అనుభవాలు కలిగాయి. వాటిని నేను మీకిప్పుడు వివరిస్తున్నాను.
బాబాకి భోజనము పెట్టడానికి ద్వారకామాయికి వెళ్ళుతూ దారిలో ఆకలితో ఉన్న ఒక కుక్కకి రొట్టెముక్క పెట్టి ద్వారకామాయిలోబాబాని దర్శించుకున్నప్పుడు బాబా అన్న మాటలు "లక్ష్మీ, ఆకలితో ఉన్న ఆకుక్కకు రొట్టె పెట్టినావు, ఆ రొట్టె నాకే చెందినది నా ఆకలి తీరినది." యెవరయితే సకల జీవరాసిలోనూ భగవంతునిచూసివాటి ఆకలిని తీరుస్తారో వారు నాకు నిజమైన భక్తులని" బాబా చెప్పినారు.
అది 1991 వ సంవత్సరము దీపావళీ పండగ రోజు. ఆ రోజు సాయంత్రము నేను నా భార్య ఒక పురోహితుడిని పిలిచి నాయింటి మొదటి అంతస్తులో ఉన్న పూజా గదిలో లక్ష్మీ పూజ చేయ సాగాము. పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు. కాని నా మనసంతా సాయిమీదే లగ్నమయి ఉంది. లక్ష్మీ పూజ పూర్తి అయ్యేలోపులో శ్రీ సాయి ఏదో ఒక రూపములో వచ్చి నన్ను నా భార్యను ఆశీర్వదించినానేను సంతోషిస్తాను అని తలిచాను. శ్రీ సాయి ఒక స్నేహితుడి రూపములో గాని, నా బంధువు రూపములో గాని వచ్చి మమ్మలిని ఆశీర్వదిస్తారని ఊహించుకోసాగాను. పూజలో లక్ష్మీ దేవికి హారతి ఇస్తున్న సమయంలో నా కాళ్ళకు మెత్తటి బట్ట తాకిన అనుభూతిని పొందాను. నేను కింద నా కాళ్ళవైపు చూసుకున్నాను, నాకు ఆశ్చర్యము కలిగింది. ఒక పెద్ద పరిమాణములో ఉన్న బోదురు కప్ప నా పాదాలను తాక సాగినది.
బాబా ఈ కప్ప రూపములో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారా అనే భావన కలిగి ఆ కప్పకు నమస్కరించాను. ఆ రోజు వర్షము కూడా పడలేదే? అంతకు ముందు వారమురోజులలోకూడా ఎక్కడా వానలు పడలేదే? మరి ఈ బోదురుకప్ప యెక్కడినించి వచ్చినదని నా భార్య ఆశ్చర్యపడసాగినది. నేను నా భార్య ఆకప్పకు మరొక్కసారి నమస్కరించాముఆ కప్ప సంతోషముతో ఒక్కొక్క మెట్టు దిగుతూ తోటలోనికి వెళ్ళిపోయినది. బాబా నన్ను నా భార్యను ఆశీర్వదించడానికి ఈ బోదురుకప్ప రూపములో వచ్చినారని భావించాను.
అది 1991 వ సంవత్సరము బక్రీదు పండగ రోజు. ఆఫీసుకు సెలవు ఉండటము వలన మధ్యాహ్న్నము పన్నెండు గంటలకు యింటిలో భోజనము చేసి తాంబూలము వేసుకుని వీధిలోకి వచ్చినాను. నా యింటి గేటుముందు నాలుగు అడుగుల యెత్తు ఉన్న ఒక తెల్లటి మేక కనపడింది ఆ మేకకు తెల్లటి గెడ్డము కూడా ఉన్నది.
ఆ మేక తాను ఆకలితో ఉన్నట్లుగా నావైపు జాలిగా చూడసాగింది. శ్రీ సాయి సచ్చరిత్ర 9 వ అధ్యాయములో బాబా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి"భగవంతుడిని జీవులన్నిటిలోనూ చూడుము." మరి బాబా నా యింటికి మేక రూపములో వచ్చి ఆకలితో ఉన్నానని చెపుతున్నారాఅని భావన కలిగింది. నేను నాభార్యను పిలిచి బాబా ఆకలితో ఉన్నారు ఏమయినా పెట్టగలవా అని అడిగినాను. అప్పటికి ఆమె బాబాకు భక్తురాలు కాదు. ఆమె కొంచెం హేళనగా మీ బాబా రాత్రి మిగిలిపోయిన రొట్టెలను తింటారా అని అడిగినది. నేను, నీవు ప్రేమతో పెడితే బాబా తప్పక తింటారని అన్నాను. నా భార్య ఒక నాలుగురోట్టెలు ఆ మేకకు పెట్టినది. ఆ మేక సంతోషముగా నాలుగురొట్టెలనుతింది, నేను చిన్న బకెట్ తో మంచినీరు పెట్టినాను. సంతోషముగా నీరు కూడా త్రాగి తృప్తిగా నావైపు నా భార్యవైపు చూసి వెళ్ళిపోయినది. బక్రీదు పండగ రోజున బాబా ఒక తెల్లటి మేక రూపములో వచ్చి నా యింట భోజనము చేసి నన్ను నా భార్యను ఆశీర్వదించారనే భావన కలిగింది.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:
Post a Comment