Saturday, April 20, 2013

సాయితత్వ రహస్యం. (secret of Sai thatwam)




మానవాళికి భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం శ్రీ సాయి. శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు . శ్రీ సాయి అలా జీవించి చూపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నోసమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం సాయితత్త్వం. చిక్కులో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయుతనిచ్చి సేద తీర్చే సాధనం సాయితత్త్వమే. మానవాళికి ఉద్దరణ కోసం, మనిషిగా మానవత్వంలో ఎలా బతకాలో చెప్పటం కోసం శ్రీ సాయి తన కాలాన్ని మొత్తం వెచ్చించారు. పూజా విధులు, పురస్కార తంతులు, విధి విధానాలు ... బాబాకు వీటితో పనిలేదు. శ్రద్ధ , సహనం ...ఇవి రెండే భక్తుల నుంచి కోరిన బాబా, వాటిని ఆచరించిన వారికి తన ప్రేమను పంచారు. సాయి ఆదర్శ జీవన విధానం మనవ సంశయాలను పటాపంచలు చేస్తుంది. బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి . ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం
     సాయితత్వాన్ని నిత్యజీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతు౦ది జీవితం ధన్యమవుతుంది .సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది. శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు . స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్ధ సద్గురు అయ్యారు .మనిషి జీవిత పరమార్ధం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి ?ఇదంతా బాబా ఆచరించి చూపారు .ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమకర్తవ్యం కదా! బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాలను చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయమనే క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్దులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి. షిరిడి సాయిబాబా యుగావతరం. నేడు ప్రపంచ౦ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకుశ్రీ సాయి సచ్చరిత్రలో పరిష్కారం లభిస్తుంది.

No comments:

Post a Comment