Saturday, April 20, 2013

సాయిబాబా కటాక్షం కోసం ప్రమిదలు వెలిగిస్తే



షిరిడీ సాయినాధునికి నూనెతో దీపాలు పెడితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని జ్యోతిష్యనిపుణుల చెబుతున్నారు. పూర్వం ప్రతిరోజూ సాయంత్రం ద్వారకామాయిలో సాయిబాబా దీపాలను వెలిగిస్తుండేవాడు. ఊరిలో ఉన్న వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి, భిక్షాటన చేసి, నూనెతో దీపాలను వెలిగించే వారు. అయితే ఒకరోజు వ్యాపారస్తులందరూ కలిసి బాబాకు నూనెను ఇవ్వడాన్ని మానుకున్నారు. బాబా నూనె కోసం వస్తే అందరూ నూనె లేదని చెప్పడం ప్రారంభించారు. విషయం గమనించిన బాబా నిరాశ చెందకుండా ద్వారకామాయికి చేరుకున్నారు. కుండలోని మంచినీటిని తీసుకుని గిన్నెలో పోసి, నీటిని ప్రమిదలలో పోసి దీపాలను వెలిగించారు. ఇది గమనించిన వ్యాపారులకు, సాయిబాబాను పరీక్షించాలనుకున్న కొందరు ప్రజలకు, సాయిబాబా దైవాంశభూతుడన్న నమ్మకం ఏర్పడింది.  బాబా ఎప్పుడూ నూనెతోనే మసీదులో దీపాలను వెలిగించేవారు. కిరోసిన్ దొరికేది కానీ, ఏరోజు కూడా బాబా కిరోసిన్తో మసీదులో దీపాలను వెలిగించలేదు. నూనెతో వెలిగించిన దీపాలు స్థిరంగా ఉండి వెలగడంతోపాటు, వాటి వెలుగు శాంతంగా, ఆహ్లాదకరంగా ఉండి భక్తుడి మనస్సును ఏకాగ్రతతో భగవంతుడిపైన కేంద్రీకరించడానికి వీలు ఉండటం వల్ల, బాబా ఎప్పుడూ నూనెతోనే దీపాలను వెలిగించేవారు.  అందుచేత ప్రతి గురువారం నూనెతో దీపారాధన చేసి సాయిబాబాను ప్రార్థించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా సాయిబాబా కటాక్షం కోసం గురువారం సాయంత్రం నూనెతో గానీ, నెయ్యితో గానీ దీపారాధన చేస్తే సఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment