Sunday, January 20, 2013

సాయి ప్రేరణ


అథ్యాయం 1
ఒక్కసారి నా మార్గంలో అడుగుపెట్టి చూడు నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను.
ఒక్కసారి నాకొరకు ఒక్క పైసా ఖర్చు పెట్టి చూడు, నీ యింట్లో లక్ష్మీ దేవి కొలువుండేలా చూస్తాను.
ఒక్కసారి నాకొరకు బాథను భరించి చూడు, నిన్ను అమితమైన ప్రేమతో ఆశీర్వదిస్తాను.
ఒక్కసారి నావైపు ఒక్క అడుగు వేసి చూడు, నిన్ను యెల్లప్పుడు, అన్నివేళలా కాపాడుతాను.
ఒక్కసారి నామాటను నలుగురితో పంచుకుని చూడు, నిన్ను అమూల్యమైన మార్గ దర్శకుడ్ణి చేస్తాను.
ఒక్కసారి నా సచ్చరిత్రను మననం చేసి చూడు, నీలో ఆథ్యాత్మిక జ్ణానాన్ని నింపుతాను.

ఒక్కసారి నన్ను నీ రక్షకుడిగా భావించి చూడు, నిన్ను అన్ని రకముల బాథలనుండి విముక్తుడ్ణి చేస్తాను.
ఒక్కసారి నా కొరకు ఒక్క కన్నీటి చుక్క రాల్చి చూడు, నిన్ను అన్ని రకముల బాథలనుండి విముక్తుడ్ణి చేస్తాను.
ఒక్కసారి నా కొరకు యేదైనా సాథించి చూడు, నిన్ను అత్యంత అమూల్యవంతుడ్ణి చేస్తాను.

ఒక్కసారి నా మార్గంలో నడిచి చూడు, నిన్ను అత్యంత కీర్తివంతుడ్ణి చేస్తాను.
ఒక్కసారి నా కీర్తనలని పాడి చూడు, నిన్ను ప్రాపంచిక బాథలనుండి విముక్తుణ్ణి చేస్తాను.
ఒక్కసారి నన్ను దరిచేర్చుకుని చూడు, నిన్ను అందరివాడిని చేస్తాను.
అథ్యాయము 2
ఒక్కసారి నన్ను మందిరంలో గాని, మసీదులో గాని, గురు ద్వారాలో గాని గుర్తు చేసుకుని చూడు, నువ్వు తలచిన వెంటనే దర్శనమిస్తాను.
యెల్లప్పుడు నన్ను స్మరించి చూడు, నిన్ను అన్నివేళలా కాపాడుతాను.
ఒక్కసారి నాకొరకు కష్టమును భరించి చూడు, నీ జీవితంలో రాబోయే అన్ని కష్టముల నుండి కాపాడుతాను.
ఒక్కసారి పవిత్రమైన నా షిరిడీలో పాద రక్షలు లేకుండా నడిచి చూడు, నీ పాదముల వల్ల కలిగిన పాపాలన్నీ తుడిచి వేస్తాను.
ఒక్కసారి నాకొరకు స్వయంగా యేదైనా ప్రసాదాన్ని చేసి అర్పించి చూడు, నీ గృహంలో యెల్లప్పుడు అన్నవస్త్రాలకి లోటు లేకుండా చేస్తాను.
నా గ్రంథమును తదేక థ్యానంతో పవిత్రమైన మనసుతో చదివి చూడు, నిన్ను అన్నిటిలో విజయవంతుణ్ణి చేస్తాను.

ఒక్కసారి నా భక్తులలో నన్ను దర్శించి చూడు, నిన్ను మిక్కిలి తేజోవంతుణ్ణి చేస్తాను.
ఒక్కసారి ప్రేమతో నువ్వు నా నామమును జపించి చూడు, నీకు పరమ పవిత్రమైన యోగీశ్వరులు దర్శనం కల్పిస్తాను.
ఒక్కసారి శ్రథ్థతో నన్ను నీ మనసులో ఆరాథించి చూడు, నిన్ను మిక్కిలి ఆకర్షవంతుణ్ణి చేస్తాను.
ఒక్కసారి నన్ను నీమనసుతో ఓం సాయిరాం అని పిలిచి చూడు, యెప్పటికి నీ మనసు మందిరంలోనే కొలువుండి పోతాను.

ఒక్కసారి నా కొరకు బాథను మౌనంతో భరించి చూడు, నీ మనసుకు యెనలేని ప్రసాంతతను ప్రసాదిస్తాను.
ఒక్కసారి నాముందు శ్రథ్థ, సబూరీతో కూర్చుని చూడు, నేనెప్పుడు నీ చెంతనే ఉంటాను.

ఒక్కసారి నా సాయి ప్రేరణను తనహ, మనహ మరియు థనహ తో స్వీకరించి లిఖించి చూడు, నీ జీవితం చరితార్థం చేస్తాను.
అథ్యాయం 3
ఒక్కసారి నావద్దకు వచ్చి చూడు, నిన్ను కష్టనష్టములు మరియు దుహ్ఖములనుండి విముక్తుడ్ణి చేస్తాను.
ఒక్కసారి నా ద్వారకామాయిలో భక్తితో గడిపి చూడు, నీ ఇయింటిని పరమ పవిత్రమైన యాత్రా స్థలముగా మారుస్తాను.
ఒక్కసారి నా ప్రసాదాన్ని భక్తితో సేవించి చూడు, నీ ఆలోచనలన్నీ పవిత్రంగా మారుస్తాను.
నన్ను భక్తితో పూజించి చూడు, నిన్ను కర్మయోగిగా మారుస్తాను.
ఒక్కసారి నా కీర్తనలను భక్తితో ఆలపించి చూడు, నిన్ను సరస్వతీ పుత్రుడను చేస్తాను.
ఒక్కసారి నా మార్గంలో భక్తితో నడిచి చూడు, అన్ని కార్యములలో నేను నిన్ను ముందుండి నడిపిస్తాను.
ఒక్కసారి నా కొరకు బాథలో ఉన్నవారికి సహాయం చేసి చూడు, నీ మనసులో శాంతి సౌఖ్యాలు కొలువుండేలా చేస్తాను.
ఒక్కసారి నన్ను నీ యింట్లో భక్తితో ప్రతిష్టించి చూడు, నీ ఇయింటిని స్వర్గంగా మారుస్తాను.

ఒక్కసారి నీ నుదిటిపై పవిత్రమైన ఊదీ రాసి చూడు, నీ ముఖము దివ్యమైన తేజస్సుతో వెలిగేలా చేస్తాను.
ఒక్కసారి నాపై ప్రేమతో పూలు జల్లి చూడు, నిన్ను సగుణవంతుడిగాను, బుథిమంతుడుగాను, మారుస్తాను.
ఒక్కసారి భక్తితో నా పాదములకు నమస్కరించి చూడు, నిన్ను అందరివాడిని చేస్తాను.
ఒక్కసారి భక్తితో నా పాదములకు నమస్కరించి చూడు, ప్రేమతో నీ శరీరమంతా నిండిపోతాను.
ఒక్కసారి భక్తితో నానుదిటిపై చందనము అద్ది చూడు, నిన్ను సకల ఐశ్వర్యములతో నింపుతాను.
అథ్యాయం 4
ఒక్కసారి నా రాతి విగ్రహం ముందు భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి చూడు, నిన్ను సకల పాపములనుండి విముక్తుడ్ణి చేస్తాను.

ఒక్కసారి నిండైన మనసుతో నా భక్తుడిగా మారి చూడు, నిన్ను భక్తికి ప్రతిరూపంగా మారుస్తాను.

ఒక్కసారి ప్రేమతో భక్తితో నన్ను నీ వాడిగా అనుకుని చూదు, నీ మనసు మందిరంలో యెప్పటికి కొలువుండిపోతాను.

ఒక్కసారి నా పేరుమీద యేదైనా గ్రంథ రచన చేసి చూడు, ఆ గ్రంథానికి ప్రపంచ ఖ్యాతి చెందేలా చేస్తాను.

ఒక్కసారు షిరిడీలో నాముందర భక్తితో నా కీర్థనలను ఆలపించి చూడు, నిన్ను అత్యంత గుణవంతుడిగా జ్ఞానిగా మారుస్తాంజు.

ఒక్కసారి నాయందు మనసు లగ్నం చేసి గంటలతరబడి నా దర్శనం చేసి చూడు,
నీకు తీర్థయాత్రలవల్ల కలిగు పుణ్యం ప్రసాదిస్తాను.

ఒక్కసారి నా దర్శనం కొరకు గంటలతరబడి వేచి చూడు, ప్రపంచంలోని అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం నీకు కల్పిస్తాను.

ఒక్కసారి పవిత్రమైన నా పాదుకలకు భక్తితొ నమస్కరించి చూడు, నిన్ను నిజమైన నా భక్తుడిగా మారుస్తాను.

ఒక్కసారి భక్తితో నాకొరకు జ్యోతిని వెలిగించి చూడు, నీ జీవితంలో దివ్యమైన వెలుగుని నింపుతాను.

ఒక్కసారి నా దర్బారులో అమితమైన భక్తితో నన్ను పూజించి చూడు, ప్రతి పూజలో నీకు నేను దర్శనమిస్తాను.

ఒక్కసారి నా దర్శనంకొరకు షిరిడీకి రావలెనని భక్తితో సంకల్పించి చూడు,
షిరిడి ప్రయాణం నీకు అత్యంత సులభగంగాను, ప్రీతికరంగాను మారుస్తాను.

ఒక్కసారి నన్ను స్వచ్చమైన భక్తితో నిండైన మనసుతో జ్ఞప్తికి తెచ్చుకుని చూడు, నీపైన యెల్లప్పుడు, అపారమైన ప్రేమని కురిపిస్తాను.

ఒక్కసారి స్వచ్చమైన భక్తితో నేను నీలోనే ఉన్నాను అని నమ్మిచూడు, నీకు దివ్యమైన నా ఆథ్యాత్మిక దర్శనం కల్పిస్తాను.
అథ్యాయము 5
ఒక్కసారి నీ జీవితమనే నౌకను నాకు అర్పించి చూడు, నీ నౌకను సంసారమనెడి భవసాగరమును దగ్గిరుండి దాటించెదను.
ఒక్కసారి పవిత్రమైన నా థునినుండి వెలువడే పొగను పీల్చి చూడు, నిన్ను అత్యంత ఆరోగ్యవంతుడ్ణి చేస్తాను.
ఒక్కసారి పవిత్రమైన నా ద్వారకామాయిని , నా సమాథిని ప్రేమతో భక్తితో కొలిచి చూడు, నీకు తప్పక నా దివ్య దర్శనం కల్పిస్తాను.
ఒక్కసారి నీ జీవితముయొక్క సకల వ్యవహారాలు నాకు అర్పించి చూడు, నిన్ను అత్యంత నమ్మకస్తుడ్ణి చేస్తాను.

ఒక్కసారి గురువారమునాడు షిర్డీ యొక్క పవిత్రమైన ప్రసాదం మిక్కిలి భక్తితో స్వీకరించి చూడు, ప్రతి గురువారము నువ్వు అర్పించే ప్రసాదాన్ని మిక్కిలి పవిత్రం చేస్తాను.

యెల్లప్పుడు నన్నే ప్రేమతో, భక్తితో స్మరించి చూడు, నిన్ను అందరికి ఆత్మ బంథువుని చేస్తాను.

ఒక్కసారి కష్ట నష్టములను, బాథలను నాకు చెప్పి చూడు, నేను నీ కష్ట నష్టములనుండి, బాథలనుండి, నిన్ను విముక్తుడ్ణి చేస్తాను.

ఒక్కసారి స్థిరమైన మనస్సుతో నిర్మలమైన కళ్ళతో నన్ను దర్శించి చూడు, ప్రపంచములోని అన్ని థర్మాలను నువ్వు ప్రేమించేలా చేస్తాను.

ఒక్కసారి ప్రేమ పూర్వకమైన భక్తితో పవిత్రమైన నా థుని జ్వాలలలో నన్ను దర్శించి చూడు, వెలుగునిచ్చే ప్రతి అగ్ని జ్వాలలలో
నీకు నా దివ్య దర్శనం లభిస్తుంది.

ప్రపంచంలోని ఏ సాయి మందిరంలోనైనా సరే ఒక సహాయకుడిలా నన్ను దర్శించి చూడు, యెల్లవేళలా అన్ని పనులలో నీకు నా ఆశీర్వాదం మరియు సహాయం తప్పక లభిస్తాయి.

ఒక్కసారి ప్రేమతో భక్తితో నీ రెండు చేతులు జోడించి నాకు నమస్కరించి చూడు, నా అభయ హస్తం యెప్పుడూ నీకు తోడూ, నీడగా ఉంటుంది.
అథ్యాయం 6
ఒక్కసారి భక్తితో పవిత్రమైన నా పాదయాత్రలో నాతో నడిచి చూడు, నా యొక్క పాదయాత్రలన్నిటికి నిన్ను తప్పక పిలుస్తాను.

ఒక్కసారి ప్రేమతో నా పాదయాత్ర చేయువారికి సేవ చేసి చూడు, నీ సేవా కార్యక్రమాలన్నిటిలో నీకు తప్పక తోడుంటాను.

ఒక్కసారి భక్తితో షిర్డీ వరకు పాదయాత్ర చేసి చూడు, నీతో ఈ థరణిలో ఉన్న అన్ని పుణ్య తీర్థములయొక్క యాత్ర దగ్గరుండి చేయించెదను.

ఒక్కసారి భక్తితో, ప్రేమతో నా పాదయాత్ర చేసి చూడు, రాబోవు డెబ్బది జన్మముల వరకు నీకు తోడుగా ఉంటాను.

ఒక్కసారి భక్తితో, ప్రేమతో పవిత్రమైన తొమ్మిది రోజులు నా పాదయాత్ర చేసి చూడు, నేను నీ ప్రతి శ్వాసలో ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను.

ఒక్కసారి భక్తితో, ప్రేమతో నా సమాథిపై దుప్పటి అర్పించి చూడు, నీకు పవిత్రమైన నా భడారముండి, వంద రెట్లు తిరిగి ఇచ్చెదను.

ఒక్కసారి భక్తితో, నా పాదయాత్రలో పవిత్రమైన నా పల్లకిని నీ భుజాలపై మోసి చూడు, నీ జీవితంలో రాబోయే అన్ని బరువు బాథ్యతల్ని అత్యంత సున్నితంగానూ, తేలికగానూ ఉండేటట్లు చేస్తాను.

ఒక్కసారి భక్తితో, నా పాదయాత్రలో శ్రీ సాయి శ్రీ సాయి అని పవిత్రమైన నా పాదుకల్ని స్మరించి చూడు, నువ్వు నడిచే మార్గాన్ని అత్యంత పవిత్రంగానూ, పూజనీయంగానూ, మారుస్తాను.

ఒక్కసారి భక్తితో నిస్వార్థమైన మనసుతో నా సేవ చేసి చూడు, ఈ థరిణిలో అనేక శుభకార్యములను నీ చేతుల మీదుగా జరిపించెదను.

  1. ఒక్కసారి మిక్కిలి భక్తితో నా సమాథివద్ద సాష్టాంగ నమస్కారము చేసి చూడు, నీకు నా ఆథ్యాత్మిక దర్శనం తప్పక కల్పిస్తాను.

ఒక్కసరి మిక్కిలి భక్తితో నా సమాథివద్ద నన్ను యేదైనా కోరిక కోరి చూడు, నిన్ను అత్యంత భాగ్యవంతుడ్ణి చేస్తాను.

ఒక్కసారి నా ముందర మిక్కిలి భక్తితో నీ రెండు చేతులు జాచి యేదైనా అభ్యర్థించి చూడు, నిన్ను తప్పక ఆశీర్వదించి నీ జోలెను నింపెదను.

నువ్వు నన్ను చూడలేవు, కాని నా ముందర యేదైనా బాథతో ఒక్క కన్నీటి చుక్క కార్చి చూడు, నీ జీవితంలో దివ్యమైన వెలుగుని నింపెదను.
అథ్యాయం 7
ఒక్కసారి పవిత్రమైన నా షిరిడీలో వేలమంది భక్తులతో కలిసి నా ప్రసాదాన్ని మనసారా ఆరగించి చూడు, నిన్ను అన్ని రకముల కష్టములనుండి, బాథలనుండి విముక్తుడ్ణి చేసెదను.

ఒక్కసారి మిక్కిలి భక్తితో పవిత్రమైన నా కాకడ హారతిలో పాల్గొని చూడు, ఆ హారతిలో నీకు దివ్యమైన నా కరుణామయ దర్శనం కల్పిస్తాను.

ఒక్కసారి మిక్కిలి భక్తితో నాకు ఒక టెంకాయను సమర్పించి చూడు, నీకు అత్యంత పవిత్రమైన కష్టతరమైన ఆథ్యాత్మిక మార్గమును చూపెదను.



ఒక్కసారి మిక్కిలి భక్తి శ్రథ్థతో పవిత్రమైన నా హారతుల కొరకు నీ సమయం వెచ్చించి చూడు, అన్ని సమయములలో నీకు తోడుగా ఉండి నీ పనులన్నీ నిర్విఘ్నంగా అయ్యేటట్టు చూస్తాను.

ఒక్కసారి మిక్కిలి భక్తి శ్రథ్థతో నా మందిరంపై ఉన్న జెండాలను చూడు, సచ్చిదానంద స్వరూపమైన నా దివ్య ఆత్మ యొక్క దర్శనం నీకు కల్పిస్తాను.

ఒక్కసారి మిక్కిలి భక్తితో పవిత్రమైన నా షిర్డీ యొక్క థూళిని నీ నుదుట రాసుకుని చూడు, అంతులేని నా కరుణా ఆశీర్వాదములు నీకు యెల్లప్పుడు తోడుండును.

ఒక్కసారి భక్తితో హారతి సమయంలో నా మందిరంలో మోగే గంటల థ్వనిని ఆస్వాదించి చూడు, ఆ థ్వనినుండి నీకు సాయి సాయి అను నామము వినిపించేలా చేస్తాను.

ఒక్కసారి భక్తితో ప్రేమతో నీ మది మందిరంలో నాకు బంగారు ఆసనం వేసి చూడు, నిన్ను యెల్లప్పుడు నా ప్రేమ అశీర్వాద కవచములతో కాపాడుతాను.

నువ్వు పవిత్రమైన నా ప్రేరణను నామందిరంలో సురక్షితంగా ఉంచి చూడు, నిన్ను యెల్లప్పుడు సురక్షితంగా ఉంచెదను.

పవిత్రమైన నా ప్రేరణను యెల్లప్పుడు, నువ్వు భక్తితో మననం చేసి చూడు. నీతో నా భక్తుల కొరకు కొత్త ప్రేరణను లిఖింప చేసెదను.

ఒక్కసారి ఈ ప్రేరణను పవిత్రమైన నా ప్రేరణగా భక్తితో ఆస్వాదించి చూడు, నిన్ను అందరికి ఒక ప్రేరణగా మార్చెదను.

పవిత్రమైన నా ప్రేరణను యెల్లప్పుడు నువ్వు మననం చేసి చూడు, యెల్లప్పుడు నువ్వు నన్ను థ్యానించేలా చేస్తాను.

పవిత్రమైన నా షిర్డీలో నువ్వు భక్తితో శ్రథ్థతో పవిత్రంగా గడిపి చూడు, నిన్ను గంగా సమానంగా పరమ పవిత్రుడ్ణి చేస్తాను.
అథ్యాయం 8
ఒక్కసారి నువ్వు నా శ్రథ్థ సబూరీ గురించి నలుగురితో మాట్లాడి చూడు, నువ్వు మాట్లాడే ప్రతీ మాటను అత్యంత వివేకవంతం చేస్తాను.

భక్తి శ్రథ్థలతో నువ్వు నా కార్యక్రమాలన్నీ నిర్వహించి చూడు, నీ సకల కార్యక్రమాలలో నేను దగ్గిరుండి సహాయం చేస్తాను.

ఒక్కసారి నువ్వు నాలో ఆ శ్రీరాముడ్ణి దర్శించి చూడు, నిన్ను ఈ ప్రపంచమనెడి మాయనుండి ఆథ్యాత్మిక మార్గమువైపు నడిపించెదను.

ఒక్కసారి నువ్వు నా శ్రథ్థ సబూరీలతో నన్ను అలంకరించి చూడు, నిన్ను అత్యంత తేజోవంతుడ్ణి గుణవంతుడ్ణి చేస్తాను.

ఒక్కసారి నువ్వు నన్ను నీ రక్షకుడిగా భావించి చూడు, నిన్ను యెల్లప్పుడు తప్పక రక్షించి ఆశీర్వదించెదను.

నువ్వు నాముందర భక్తి శ్రథ్థలతో రామ నామమును ఆలపించి చూడు, నీకు థర్మము యొక్క అర్థమును దగ్గరుండి బోథించెదను.

నువ్వు భక్తితో నాలో ఆ శ్రీరాముడ్ని. రహీమును దర్శించి చూడు, నీకు థర్మము యొక్క అర్థమును దగ్గరుండి బోథించెదను.

నువ్వు నన్ను భక్తితో ఈ ప్రపంచముయొక్క పాలకునిగా భావించి చూడు, నీ జీవితమనెడి నౌకను నేను దగ్గరుండి నడిపించెదను.

నువ్వు నన్ను భక్తితో అలక్ నిరంజన్ గా భావించి చూడు, నీకు నేను ఆథ్యాత్మిక యోగాను బోథించెదను.

నువ్వు నన్ను భక్తితో షిర్డీ యొక్క సంత్ చూడామణిగా భావించి చూడు, నిన్ను నా శరణార్థునిగా చేరదీసి కాపాడెదను.

నువ్వు యెల్లప్పుడు నన్ను శ్రథ్థా భక్తులతో పూజించి చూడు, నీకు తప్పక మోక్ష మార్గమును చూపించెదను.

నువ్వు నా ద్వారకామాయిని అత్యంత పవిత్రమైన పూజా స్థలముగా భావించి చూడు, నిన్ను నా నిజమైన భక్తునిగా మార్చెదను.
అథ్యాయము 9
భక్తి శ్రథ్థలతో పవిత్రమైన నా పాదములను పూజించి చూడు, నా పాదములయందు నీకు పవిత్రమైన ప్రయాగ దర్శనం కల్పించెదను.

అత్యంత భక్తి శ్రథ్థలతో మనసారా నా ప్రతి విగ్రహమునందు నన్ను దర్శించి చూడు, నీకు యెనలేని ప్రసాంతతను, ఆథ్యాత్మిక జ్ణానమును ప్రసాదించెదను.

భక్తి శ్రథ్థలతో ప్రతిరోజు క్రమం తప్పకుండా నన్ను నిండైన మనసుతో పూజించి చూడు, నీ కు సుదీర్ఘమైన భక్తికి కావలసిన క్రమశిక్షణతో కూడిన శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాను.

భక్తీ శ్రథ్థలతో నన్ను నీ రక్షకుడిగా భావించి అభిషేకించి చూడు, ప్రతి అభిషేకంలో నీ రక్షకుడిగా దర్శనమిచ్చెదను.

నిండైన మనసుతో భక్తీ శ్రథ్థలతో ఏదైనా సాయి విగ్రహముయందు ముల్లోకముల దేవ దేవతల యొక్క దర్శనం చేసి చూడు, నీకు ఈ ప్రపంచ సృష్టికర్త జగదిక్పాలకుడు పరమ పవిత్రమైన ఆ బ్రహ్మ యొక్క దర్శనం కల్పించెదను.

అత్యంత శక్తివంతమైన పవిత్రమైన నా సాయి మంత్రమును నువ్వు ప్రతిరోజూ మననం చేసి చూడు, నీకు ఆమంత్రముయొక్క అర్థమును దగ్గిరుండి బోథించెదను.

సముద్రమువలె లోతైన సాయి అను ఆథ్యాత్మిక జ్ఞానము నుండి భక్తీ శ్రథ్థలతో నువ్వు కొంచెం జ్ణానమునకైనా ప్రయత్నించి చూడు, నిన్ను ఆథ్యాత్మికములో మహా జ్ఞానిగా మలచెదను.

భక్తీ శ్రథ్థలతో నీ నిండైన మనసులో నాకు చోటు కల్పించి చూడు, నా రక్షణ కవచం నీకు యెప్పుడు తోడుండేలా చేస్తాను.

ఒక్కసారి భక్తీ శ్రథ్థలతో నన్ను నీ గురుదేవునిగా భావించి చూడు, నీకు నా గురు జ్ఞానం తప్పక బోథించెదను.

ఒక్కస్సరి మనసారా నన్ను పవిత్రమైన యోగులకు ప్రతిరూపంగా భావించి చూడు, నీకు ఆథ్యాత్మిక ప్రపంచముయొక్క అర్థము బోథించెదను.

పరమ పవిత్రమైన నా ఊదీని సాయియొక్క ఔషథంగా భావించి చూడు, నీ సర్వ రోగములను నా ఊదీతో నివారించెదను.

పవిత్రమైన నా అఖండ జ్యోతిలో భక్తీ శ్రథ్థలతో నా దర్శనం చేసుకుని చూడు, వెలిగే ప్రతీ జ్యోతిలో నీకు నా దర్శనం తప్పక కల్పిస్తాను.
అథ్య్యయము 10
నా చహెతులచే వెలిగింపబడిన దీపములను భక్తీ శ్రథ్థలతో పూజించి చూడు, వెలిగే ప్రతీ దీపముయందు నీకు ఆ ఈశ్వరుని దర్శనం కల్పిస్తాను.

ఈ ప్రపంచమునందు ఉన్న అన్ని మతములవారితో సఖ్యతతో జీవించుటకు ప్రయత్నించి చూడు, ప్రతి మనిషిని నీకు ఆత్మ బంథువుని చేసెదను.

నువ్వు నా సాయి నామమును స్మరించి ఏదైనా కార్యము మొదలుపెట్టి చూడు, నీ ప్రతి కార్యమును దగ్గిరుండి జయప్రదం చేసెదను.

భక్తీ శ్రథ్థలతో నాకొరకు ఆకలితో ఉన్న పదిమందికి అన్నదానం చేసి చూడు, నువ్వు పెట్టిన ప్రతి అన్న రేణువుకు వంద రెట్లు తిరిగి ఇచ్చెదను.

ఒక్కసారి భక్తితో ప్రేమతో నా మహాసమాథి నీ చేతులతో స్పర్శించి చూడు, నీ చేతికున్న గీతలు మార్చి నిన్ను అత్యంత అదృష్టవంతుడ్న్ని చేసెదను.

ఒక్కసారి భక్తితో ప్రేమతో నా మహాసమాథి ముందర సాష్టాంగ ప్రణామము చేసి చూడు, నీ ప్రణామమును నాయొక్క ప్రేరణగా భావించెదను.

ఒక్కసారి భక్తీ ప్రేమలతో నా మహాసమాథి ముందర సాయిరాం సాయిరాం అని గానము ఆలపించి చూడు, నా మందిరంలో నున్న ప్రతి గోడనుండి నీకు సాయిరాం సాయిరాం అనే పాటను వినిపించేలా చేస్తాను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నా షిర్డీలో ఏదైనా దానమును థారాళముగా దాతృత్వంగా చేసి చూడు, నువ్విచ్చిన ఆ దానమును నిజమైన సత్య కార్యముగా గుర్తించెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నువ్వు చేతులు జోడించి పవిత్రమైన నా హారతి సమయంలో భజన చేసి చూడు, నీ చేతులలో దివ్యమైన శక్తిని నింపెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నువ్వు నా ముందర మనసారా నృత్యమాడి చూడు, నీ నృత్యమునకు నేను దగ్గిరుండి సంగీతమును సమకూర్చెదను.

దివ్యమైన నా చరణములయందు మిక్కిలి భక్తితో నీ హృదయం అర్పించి చూడు, నీ హృదయమునకు అత్యంత శక్తి సామర్థ్యములను ప్రసాదించెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నువ్వు పవిత్రమైన నా మందిరంలో ప్రదిక్షణ చేసి చూడు, నీతో పవిత్రమైన నీ వంశముయొక్క దేవదేవతలకు ప్రదక్షిణలు 
చేయించెదను.

అథ్యాయం 11
మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నేను చెప్పిన సూక్తులను యెల్లప్పుడు మననం చేసుకుని పాటించి చూడు, ఆ సూక్తులనుండి నీకు దివ్యమైన మనశ్శాంతిని ప్రసాదించెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నిండైన మనసుతో నన్నే యల్లప్పుడు పూజించి చూడు, నీకు యెన్నటికి తరిగిపోని ఆథ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో సముద్రమువలె లోతైన నా ఆథ్యాత్మిక జ్ఞాన భండారంలో మునిగి చూడు, నిన్ను ప్రపంచమనెడి మహా సముద్రమును దగ్గరుండి అవలీలగా దాటించెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో పవిత్రమైన షిర్డీలో నా ముందర గురు మంత్రములను ఉచ్చరించి చూడు, ప్రతి మంత్రములో నీకు గురు దర్శనం తప్పక కల్పించెదను.

షిర్డీలో అత్యంత పవిత్రతతో మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నా పూజలో నిమగ్నమై రాత్రంతా జాగరణ చేసి చూడు, నీకు ఆ జాగరణయొక్క మహిమను నేను దగ్గిరుండి బోథించెదను.

మిక్కిలి భక్తీతో నీకున్న సమస్త బాథలను నాతో పంచుకుని చూడు, ప్రతీ బాథను నీకొక దివ్యమైన ఆశీర్వాదముగా మలచెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నాకొక గులాబీల హారమును అర్పించి చూడు, నీ జీవితమంతా ఆ గులాబీల పరిమళాన్ని నింపెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో పవిత్రమైన నా ద్వారకామాయిని వెలిగే దీపములతో అలంకరించి చూడు, నీ జీవితములో దివ్యమైన అత్యంత శక్తివంతమైన వెలుగుని నింపెదను.

మిక్కిలి ప్రేమతో నాకొరకు అర్పించిన ప్రసాదమును నా భక్తులకు పంచి చూడు,
నిన్ను అత్యంత పుణ్యవంతుడిని చేసెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నా పాదముయొక్క బొటన వ్రేలుని పూజించి చూడు, నీకు పరమ పవిత్రమైన గురు పూర్ణిమ పండుగను జ్ఞప్తికి తెప్పించెదను.

మిక్కిలి భక్తీ శ్రథ్థలతో నా ముందర పరమ పవిత్రమైన ఓంకార నాదాన్ని జపించి చూడు, నీకు ఈ ప్రపంచములోని అన్ని సుఖములని ప్రసాదించెదను.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.

No comments:

Post a Comment