Total Pageviews

Thursday, June 2, 2016

సాయి సందేశం ‘సబ్‌కా మాలిక్‌ ఏక్‌’

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో వుంది. ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు.
శ్రద్ధ, సబూరి 
శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు. సాయినాధుడు ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేర్వేరు వాదనలు వున్నాయి. అహ్మద్‌నగర్‌ జిల్లాలోనే 19 శతాబ్దంలో జన్మించినట్టు కొందరు పర్బానీ జిల్లాలో జన్మించినట్టు మరికొందరు పేర్కొంటారు. అయితే ఈ వాదాలను పక్కనబెడితే హిందూ, ముస్లింల మధ్య సఖ్యతకు కృషి చేసిన మహనీయుల్లో ఆయన అగ్రగణ్యుడు. షిర్డిలోని పాత మసీదు మందిరాన్నే తన నివాసంగా చేసుకొని మత సామరస్యత కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన వున్న గురుస్థానంలో ఆయన కూర్చొనివుండేవారు. తొలిసారిగా 1854లో బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో వుండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించలేదు.
ఆవో సాయి.. 
షిర్డి గ్రామంలోని ఖండోబా మందిరంలో మహాల్సాపతి పూజరిగా వుండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. భగవుంతునికి ఎలాంటి పేర్లు వుండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిచెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. మహాల్సాపతి, శ్యామ, హరి సీతారాం, దామోదర్‌... తదితరులు ఆయన శిష్యగణంలో వుండేవారు. స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేకమంది భక్తులు షిర్డికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధినుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్యవ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజనక్షేత్రంగా మారిపోయింది.
సమాధిమందిర నిర్మాణం: బాబా భక్తులలో నాగ్‌పూర్‌కు చెందిన గోపాల్‌రావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం. షిర్డి ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాదిమంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. మందిరప్రవేశంతోనే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ దివ్యానుభూతి చెందుతారు. ద్వారకామాయితో పాటు చావడి, గురుస్థానం, నందదీప్‌, లెండి గార్డెన్స్‌... తదితర ప్రాంతాలను మనం చూడవచ్చు. ఈ ప్రదేశాల్లో సాయి నడియాడిన అంశం మనకు గుర్తుకు వస్తే మనస్సులో ఆధ్మాత్మిక భావం అలముకుంటుంది. సాయి సంస్థాన్‌ వారు బాబా వస్తువులతో ప్రత్యేకంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. వీటిని కూడా వీక్షించవచ్చు.
వసతి సౌకర్యం 
* సంస్థాన్‌ వారు అనేక వసతి సముదాయాలను నిర్వహిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా ముందుగానే రిజర్వ్‌ చేసుకోవచ్చు, 
* ప్రైవేటు వసతి గృహాలు ఎక్కువగా వున్నాయి. భక్తులు వారి ఆర్థిక స్థోమతకు తగినట్టుగా గదులను తీసుకోవచ్చు.
ఎలా చేరుకోవచ్చు 
* దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి షిర్డికి రైలు, బస్సు సౌకర్యముంది. 
* హైదరాబాద్‌ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌, సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లు వున్నాయి. 
* అజంతా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేవారు దిగివలసిన స్టేషన్‌ నాగర్‌సోల్‌. అక్కడ నుంచి షిర్డికి అనేక వాహనాలు వుంటాయి. 
* సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళితే నేరుగా షిర్డి చేరుకోవచ్చు. 
* షిర్డి సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 
* ఔరంగాబాద్‌ విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా షిర్డి చేరుకోవచ్చు.

Sunday, May 29, 2016

దీర్ఘరోగాలు ఉపశమనం కొసం ......!!

దీర్ఘరోగాలు ఉపశమనం కొసం ......!!
ధుని ముందు కూర్చున్న సాయినాథుని చిత్రపటం దగ్గర రోజూ చిటికెడు వీభూది వేసి, నమస్కారం చేసి దాన్ని ధరిస్తుండడం వల్ల దీర్ఘరోగాలు ఉపశమిస్తాయి.

Thursday, May 26, 2016

షిరిడీలో నివాసం.........!!

తన మసీదు వరండాలో సాయిబాబా 1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి “Aao Sai” "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' నామం స్థిరపడి అతడు "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు.
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.
ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.
1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించేవారని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవారు.
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.
తన స్వరూపం తాను తెలుసుకున్నవాడు జ్ఞాని. సూర్యుడికి చీకటి తెలియదు. జ్ఞానికి దుఃఖం తెలియదు. ఈ లోకాన్ని జ్ఞాని మాత్రమే ప్రేమించగలడు. జ్ఞానిది శివదృష్టి. అజ్ఞానిది శవ దృష్టి. ‘నేను ఆత్మను... నాకు ఒక దేహం ఉంది’ అని జ్ఞానికి తెలుసు. ‘నేను దేహాన్ని... నాకు ఒక ఆత్మ ఉంది’ అనుకొంటాడు అజ్ఞాని. జ్ఞాని దేహం దేవాలయం. దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి జ్ఞానికి జరగవలసిన పనులు జరుగుతుంటాయి కాని, కర్తృత్వం ఉండదు. జ్ఞాని శరీరం ధరించి ఉన్నంతమాత్రం చేతనే లోకానికి మేలు జరుగుతుంది. మల్లెతోటలో కూర్చుని మనకు పరిమళం రావాలని కోరుకోనక్కర్లేదు. అదేవిధంగా జ్ఞాని సన్నిధిలో కాంతి, శక్తి, శాంతి నిండి ఉంటాయి.

Thursday, March 24, 2016

అమృతతుల్యమగు బాబా పలుకులు......

దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా అనేకసార్లు మసీదులో ఈ క్రింది మధురవాక్యాలు పలికారు. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేక ఈ జగత్తు అంతా వారికి శూన్యం, నా కథలు తప్ప మరేమీ చెప్పరు, సదా నన్నే ధ్యానం చేస్తారు. నా నామాన్నే ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానిస్తారో వారికి నేను ఋణగ్రస్తుడిని, వారికి మోక్షాన్ని యిచ్చి వారి ఋణం తీర్చుకుంటాను. ఎవరయితే నన్నే ధ్యానిస్తూ నా గురించే దీక్షతో ఉంటారో, ఎవరయితే నాకు అర్పించనిదే ఏమీ తినారో అలాంటివారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరయితే నా సన్నిధానానికి వస్తారో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కాబట్టి నీవు గర్వం అహంకారం లేశమైన లేకుండా, నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్యశరణాగతి వేడుకోవాలి. ఓం సద్గురు సాయిరాం ॐ 🌿

Wednesday, March 23, 2016

ఎంతెంత దయ నీది ఓ సాయి

ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
తొలగించినావు వ్యాధులు ఊధితో
వెలిగించినావు దివ్వెలు నీటితో
తొలగించినావు వ్యాధులు ఊధితో
వెలిగించినావు దివ్వెలు నీటితో
నుడులకు అందవు నుతులకు పొంగవు
నుడులకు అందవు నుతులకు పొంగవు
పాపాలు కడిగేసే పావను గంగవు
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు
అణువున నిండిన బ్రహ్మాండంలా...ఆ..
అణువున నిండిన బ్రహ్మాండంలా
అందరిలో నీవే కొలువున్నావు
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై
ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై
మారుతి నీవే గణపతి నీవే
మారుతి నీవే గణపతి నీవే
సర్వదేవతల నవ్యాకృతి నీవె
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి

జ్ఞానదీపాలు వెలిగించే సాయిబాబా...

మనం నిత్యం సత్యాన్నే వెంటపెట్టుకుని ఉండాలి. భగవంతునికి ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో సహృదయంతో మెలగాలి. బాబాకు సేవ చేస్తున్నామనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు.
సాయిబాబాకు దీపాలంకరణ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ద్వారకామాయిలో నూనె దీపాలు వెలిగించి దేదిష్యమానం చేస్తూ ఉండేవారు. అందుకు అవసరమైన నూనెను షిర్డీలోని దుకాణదారులను అడిగి తెచ్చుకునేవారు. కొద్ది రోజులకు వ్యాపారుల్లో దుర్భుద్ధి ప్రవేశించి రోజు బాబాకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి? అనుకున్నారు. బాబా యథావిధిగా వ్యాపారుల వద్దకు వెళ్లి నూనె అడిగారు. ఎవ్వరూ ఇవ్వలేదు. తమ వద్ద నూనె లేదని చెప్పారు. నూనె లేదు కాబట్టి బాబా ఏం చేస్తారో చూడాలనే కుతూహం వారిలో కలిగింది.
బాబా ప్రతిరోజు నూనె తెచ్చుకునే డబ్బాలో నీళ్లును పోసి బాగా కలియత్రిప్పి ఆనీటిని నోటిలోకి తీసుకుని పుక్కిలించి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు. రాత్రంతా అవి జ్ఞానప్రకాశాలను విరజిమ్మాయి. ఇదంతా చూసిన వ్యాపారుల కళ్లకు అజ్ఞానపు చీకట్లు ఆ వెలుగులో తొలగిపోయాయి. క్షమించమంటూ బాబా కాళ్ళపై పడ్డారు. అబద్దాలు ఆడవద్దని, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకవలెనని చెప్పి బాబా వారిని పంపించారు.
నిజానికి సూర్యాచంద్రులనే ఆకాశ దీపాలుగా నిలిపిన మహిమాన్వితుడికి నూనె దీపాలు వెలిగించటం ఓ లెక్కా? బాబా దీపాలు వెలిగించాలంటే నూనె అక్కర్లేదు. సంకల్పం చాలు. కానీ, మానవావతారంలో నడిచిన దైవం బాబా. అందుకే మామూలు మనిషిలా నటించి ఎలా బతుకుతాడో జీవించి చూపారు.
బాబా భక్తుల్ని సన్మార్గంలో పెట్టటానికి, వారి పాపాలు, కర్మల్ని ధ్వంసం చేసి మానవజన్మను చరితార్థం చేయడానికి అవతరించిన దివ్య పురుషుడు. మనం భగవంతునికి భక్తితో పాటు ప్రేమను కూడా అర్పించాలి. నిజానికి మనం అడగదల్చుకున్నవన్నీ గ్రహించి కోరకుండానే అనుగ్రహించి భగవంతుడికి మనం అర్పించుకునేది పరిపూర్ణ భక్తిని మాత్రమే. దానిని శ్రద్ధ, విశ్వాసాలతో పాటించటం ముఖ్యం.
ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్

Monday, March 21, 2016

సాయిబాబా కటాక్షం కోసం ప్రమిదలు వెలిగిస్తే...


షిరిడీ సాయినాధునికి నూనెతో దీపాలు పెడితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని జ్యోతిష్యనిపుణుల చెబుతున్నారు. పూర్వం ప్రతిరోజూ సాయంత్రం ద్వారకామాయిలో సాయిబాబా దీపాలను వెలిగిస్తుండేవాడు. ఊరిలో ఉన్న వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి, భిక్షాటన చేసి, ఆ నూనెతో దీపాలను వెలిగించే వారు. అయితే ఒకరోజు వ్యాపారస్తులందరూ కలిసి బాబాకు నూనెను ఇవ్వడాన్ని మానుకున్నారు. బాబా నూనె కోసం వస్తే అందరూ నూనె లేదని చెప్పడం ప్రారంభించారు. ఈ విషయం గమనించిన బాబా నిరాశ చెందకుండా ద్వారకామాయికి చేరుకున్నారు. కుండలోని మంచినీటిని తీసుకుని గిన్నెలో పోసి, ఆ నీటిని ప్రమిదలలో పోసి దీపాలను వెలిగించారు. ఇది గమనించిన వ్యాపారులకు, సాయిబాబాను పరీక్షించాలనుకున్న కొందరు ప్రజలకు, సాయిబాబా దైవాంశభూతుడన్న నమ్మకం ఏర్పడింది. బాబా ఎప్పుడూ నూనెతోనే మసీదులో దీపాలను వెలిగించేవారు. కిరోసిన్ దొరికేది కానీ, ఏరోజు కూడా బాబా కిరోసిన్‌తో మసీదులో దీపాలను వెలిగించలేదు. నూనెతో వెలిగించిన దీపాలు స్థిరంగా ఉండి వెలగడంతోపాటు, వాటి వెలుగు శాంతంగా, ఆహ్లాదకరంగా ఉండి భక్తుడి మనస్సును ఏకాగ్రతతో భగవంతుడిపైన కేంద్రీకరించడానికి వీలు ఉండటం వల్ల, బాబా ఎప్పుడూ నూనెతోనే దీపాలను వెలిగించేవారు. అందుచేత ప్రతి గురువారం నూనెతో దీపారాధన చేసి సాయిబాబాను ప్రార్థించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా సాయిబాబా కటాక్షం కోసం గురువారం సాయంత్రం నూనెతో గానీ, నెయ్యితో గానీ దీపారాధన చేస్తే సఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.