Total Pageviews

Friday, April 25, 2014

కెనడాలో బాబా దివ్య దర్శనం (email recived from ranadheer kumarji)

ఈ రోజు ఒక అద్భుతమైన బాబా లీలను తెలుసుకొందాము.  మీకందరకూ గుర్తుండే ఉంటుంది.  కొన్నాళ్ళ క్రితం బాబా వారు షిరిడిలో ని ద్వారకామాయిలో కనపడిన విషయం..   దాని చిత్రం కూడా ఇక్కడ జత చేస్తున్నాను.  అదేవిధంగా కెనడాలోని సాయిధామం లో కనపడిన వృత్తాంతాన్ని ఇప్పుడు చదవండి.
కెనడాలో బాబా దివ్య దర్శనం
బాబా షిరిడీలో దర్శనమిచ్చిన తరువాత కెనడాలోని సాయిధామం లో దర్శనమిచ్చారు.
మా సాయిధామం పరివారందరమూ కూడా అఖండ రామనవమి ఉత్సవాలను ఉదయం 9 గంటలనుండి రాత్రి 9 గంటలవరకు జరుపుకొంటున్నాము. అదేరోజు మేము వచ్చిన ప్రతివారికి వారం రోజులపాటు ఉదయం అల్పాహారము మధ్యాహ్న్నం భోజనాలు ఏర్పాటు చేశాము.  బాబా వారు చెప్పిన ప్రకారం ఎవరూ కూడా ఆకలితో తిరిగి వెళ్ళకూడనే సూత్రాన్ని పాటించి అందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశాము. 

ఆరోజు కార్యక్రమమంతా కూడా చాలా బాగా జరిగింది.   శేజ్ ఆరతి పూర్తవగానే బాబా ముందు ఉన్న రెండు తెరలను వేసేశాము.  ఇక మూడవ తెర దించుతుండగా కొంతమంది భక్తులు తెర దించవద్దని చెప్పారు. శుభ్రా ముఖర్జీ అనే భక్తురాలితో బాబా సజీవంగా కనపడుతున్నారని చెప్పారు.  మొట్టమొదటగా చూసిన వ్యక్తి నవీన్.  మొదటగా అది తన భ్రమేమో అనుకున్నాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు.  తనప్రక్కనే ఉన్న ఇద్దరు భక్తులతో వారికి కూడా బాబా కనిపిస్తున్నారా అని అడిగాడు.  వాళ్ళు కూడా తమకి బాబా కనిపిస్తున్నారని చెప్పారు.  ఆర్గనైజేషన్ కో-ఫౌండర్ అయిన శుభ్రా ముఖర్జీ తో అదే విషయాన్ని చెప్పారు.  ఆమె ఇక మూడవ తెరను దించడం ఆపివేసి అక్కడున్నవారందరికి బాబా ని చూసే అదృష్టాన్ని కల్పించారు.  ఆరోజు రాత్రంతా భక్తులందరూ వేకువజాము 4 గంటల వరకూ అక్కడే ఉన్నారు.  మరుసటి రోజు కూడా బాబా గారు కనిపించారు.
(కెనడా సాయిధామం లో బాబావారి దర్శనం పైన చిత్రంలో చూడవచ్చు)
ఇక్కడ కెనడాలో  సాయిధాం లో బాబా వారు సజీవంగా కనిపించారు. ఈ సంఘటనను తోటి భక్తులందరికీ కూడా పంపించి వారందరికి బాబా అనుగ్రహం కల్పించమని కోరుతున్నాము. 
జై సాయిరాం 
శుభ్రా ముఖర్జీ  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Friday, April 18, 2014

బాబాతో మధురక్షణాలు---------సాయిపుత్రి



బాబాతో మధురక్షణాలు కొన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను. బాబా సంకల్పము లేనిదే షిరిడి వెళ్ళలేము.ఆయన సేవ చెయ్యలేము, కనీసము నామము కూడా పలుకలేము. బాబా తన ఒడిలో చేరిన బిడ్డలను తిరిగి ఇంటికి చేరేదాక ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఈలీల వలన మీకు అర్దమవుతుంది.

షిరిడి వెళ్ళినప్పుడల్లా 4రోజులు ఖచ్చితముగా ఉంటాను. నేను ఒక్కదానే ఎలా వెళ్ళాలా అని అలోచిస్తుంటే  అంతలో నా చెల్లి షిరిడి వస్తానంది.తను బాబాకి గొప్ప భక్తురాలు. మొదటిసారిగా తను నాతో షిరిడి వస్తుంది. హైదరాబాద్ నుంచి షిరిడికి ట్రావెల్స్లో బస్సుకి టికెట్ బుక్ చేసుకున్నాము. అక్కడ నాలుగురోజులు ఉందామని ప్లాన్ చేసుకున్నాము. ట్రావెల్స్ వాళ్ళు వెళ్ళినరోజు ఉండటానికి రూము ఇస్తారు తరువాత ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి డబ్బు కట్టాలి. మేము ఒకరోజు ఉండి తరువాత సంస్థాన్ వసతిగృహములో రూము తీసుకుందమనుకున్నాము. బుధువారము రాత్రి బయలుదేరి గురువారము ప్రొద్దున్నే షిరిడికి చేరినాము. నేను అంతకముందు షిరిడి వెళ్ళానుగాని నాకుకూడా పూర్తిగా తెలియదు. షిరిడి వెళితే రోజంతా బాబా గుడిలోనే గడుపుతాను. గురువారము బాబా దర్శనము చేసుకున్నాము. రోజంతా దర్శనము చేసుకుంటానే ఉన్నాము. పల్లకి ఉత్సవము కూడా దర్శించుకున్నాము. బాబాని చూడగానే ఇన్నిరోజుల నిరిక్షణకి ప్రతిఫలము దక్కినంత ఆనందం కలిగింది. ఏటుచూసినా బాబా చిత్రపటాలు, విగ్రహాలు చూసేసరికి ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయాము. అక్కడ ప్రతిరేణువలోను, దూళిలోనూ బాబానే కనిపించేవారు. అక్కడంతా బాబా ప్రేమతో నిండిపోవడము వలన ఒక్కసారిగా ఒళ్ళు పులకరించింది. గుండెల నిండా ఆనందం నింపుకోని రూముకి వచ్చాము. తరువాతరోజు రూము ఖాళీచేసి సంస్థాన్ వసతిగృహాములో రూము బుక్ చేసుకుందామని వెళ్ళాము

అక్కడ రూల్స్ మాకు తెలియవు. కేవలము అమ్మాయిలకి రూములు ఇవ్వమని చెప్పారు. కావాలంటే లాకర్ ఇస్తామన్నారు. మేము ఇద్దరము సందిగ్దములో పడ్డాము. హొటల్కి వెళ్ళి ఉండటానికి మా దగ్గర డబ్బులు సరిపోవు, ఏమి చెయ్యాలో తెలియలేదు. ట్రావెల్స్ హొటల్ క్యాంటీన్ నడిపించే ఒకావిడ నాకు బాగా పరిచయము. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పుకున్నాము. ఆవిడ హోటల్ వాళ్ళతో మాట్లాడింది. అప్పటికే అక్కడ రూములు బుక్ అయిపోయినాయి. ఆవిడ రాత్రి రూములో ఉండేటట్టు పొద్దునే ఖాళి చేసేటట్టు మట్లాడింది. మాకు చాలా సంతోషమనిపించింది. మేము పగలు ఎలాగో గుడిలోనే ఉంటాము, కేవలము రాత్రి మాత్రమే మాకు ఉండటానికి కావాలి. బాబా మాకు తగినట్టుగానే సహయము చేసినారు. మా దగ్గర డబ్బులు లేకపోవడము వలన బోజనశాలలోనే తిందామనుకున్నాము. ప్రోద్దున్నే ఆంటీ వచ్చి మాకు టిఫిన్ పెట్టింది. కనీసము మా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు. ఒక అమ్మ తన బిడ్డలని చూసుకున్నట్టు చూసుకుంది. రాత్రి మేము వచ్చేవరకు ఎదురుచూచేది. మేము రాగానే బోజనము పెట్టేది. 4రోజులు బాబానే మాకు ఇవన్ని ఏర్పాటు చేసారు. మాకు ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బాబా చూపిన లీలా షిరిడి వెళ్ళినప్పుడల్లా గుర్తొస్తుంది.

బాబా ప్రేమమూర్తి,దయామయుడు,భక్తవత్సలుడు. తల్లిలాగ,తండ్రిలాగ తన దగ్గరికి వచ్చిన భక్తులను కంటికిరెప్పలాగ కాపాడుతుంటాడు. మనము కేవలము ఫ్రేమతో సహనము పాటించాలి. బాబా కేవలము ప్రేమకు ఆధీనుడు. అందరికి చెప్పెదేమిటంటే బాబాపై నమ్మకముంచండి. అయనే మిమ్మలిని ముందుకి నడిపిస్తారు. రక్షకుడిగా నిలుస్తారు.



ఇట్లు,

సాయిపుత్రి

Saibaba created by Sri Sai Viswachaithanya Swami I

Saibaba call centre for getting solutions for our problems from Saibaba created by Sri Sai Viswachaithanya Swami I

Thursday, April 17, 2014

షిర్డీ సాయిబాబా జీవనశైలి

ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న
షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా
ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ
సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే... బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే
నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ,
మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో
పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని
భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు.
ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు.
అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు.
అప్పటికే గంగాళం నిండా
భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా
చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన
వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు. ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి
మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో
కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ
కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత
కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు.
చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో
తెలియదు. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా
బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే
బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో
కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి,
మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి
కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు. సాయినాథునికి ఎండ తగలకుండా
కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు.
లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా
పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే
భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి
రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు. ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల
గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే
భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ
నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి
సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా
మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు. హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద
ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి
ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన
భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ
ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన
నైవేద్యం నుండి సేకరించినవి. సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద
రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి
వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే
బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న
లడ్డూలు, పాలకోవాలు మొదలైన
ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు. సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన
భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి
లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో,
ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.

Saturday, April 12, 2014

సాయిబాబాతో నా అనుబంధము -------------- అంజలి.






అందరికి నా నమస్కారములు.నేను అనుభూతులని మీతో పంచుకుంటున్నది నా గురించి గొప్పగా చెప్పుకోవడం కోసము కాదు, నేను మంచిస్థాయికి వెళ్ళాలని కాదు. బాబాగారు కొందరికి కలలో కనిపించి కొన్ని మంచి విషయాలు చెబుతారు. విషయాలు మనము తప్పకుండా పాటించాలి. బాబా మన కోరికలను ఏలా నెరవేరుస్తారో మనము కూడా ఆయన కోరికలని నెరవేర్చాలి అని నేను అనుకుంటున్నాను. బాబాని నేను ఎప్పుడు దేవుడులాగ చూడలేదు, బాబాగారిని ఒక మంచి స్నేహితుడిలాగ, తాతలాగ, తండ్రిలాగ చూస్తాను. కోపము వచ్చిన, సంతోషము వచ్చిన,బాధ వచ్చిన, నేను బాబాకే చెప్పుకుంటాను. నాకు ఎల్లప్పుడు బాబా నాప్రక్కనే వున్నట్టు అనిపిస్తుంది. బాబాగారు తమ భక్తులని వదులుకోరు అని మీకు దీనిద్వారా తెలుస్తుంది.



బాబాగారు నా ప్రసాదాన్ని ఎలా తీసుకున్నారో చూడండి. ఇంతకముందు అనుభూతులలో చెప్పాను, షిరిడికి ఎవరు వెళ్ళుతున్నా నేను బాబాకి ప్రసాదము పంపిస్తాను. ప్రతి నెలలో నా ప్రసాదము 4,5 సారులు వెళ్ళుతుంది. ప్రతినెలా మా గుడిలో ఎవరో ఒకరు షిరిడి వెళ్ళుతుంటారు నాకు చెబుతారు. నేను వాళ్ళకి ప్రసాదము ఇచ్చి పంపుతాను. జనవరి 2014 మొదటివారములో నా ప్రసాదము మూడుసార్లు వెళ్ళింది. జనవరి 25 నా పుట్టినరోజు, అదే రోజు ఒక అబ్బాయిది కూడా పుట్టినరోజు. తను ఎక్కువుగా షిరిడి వెళ్ళతాడు, బాబా అంటే తనకు చాలా ఇష్టం నా ప్రసాదము ఎప్పుడు తీసుకొనివెళ్ళతాడు. అతను జనవరి 23 తారీఖున షిరిడి వెళ్ళతానని డిసెంబర్ నెలలో చెప్పాడు, మీరు వస్తారా అని నన్ను అడిగారు కాని నేను రానన్నాను. తరువాత అతను కనిపించలేదు. 23 జనవరి 2014 గురువారము తప్పకుండా గుడికి వస్తాడు, ప్రసాదం కోసము అడుగుతాడు అని ఎదురుచుస్తున్నా కాని అతను అడుగలేదు. నాకు చాలా బాధ అనిపించి ఆఫీసుకు వచ్చేసాను. నేను ఆఫీసుకు వచ్చానుగాని ఏపని చెయ్యలేకపోతున్నాను. ఎప్పుడు నా ప్రసాదం అడిగి తీసుకు వెళ్ళేవాడు నా పుట్టినరోజుకు ఎందుకు తీసుకు వెళ్ళడం లేదని. బాబాకు నా ప్రసాదము తీసుకోవడము ఇష్టము లేదా?ఏమి చెయ్యాలో అర్దం కాలేదునాకు చిట్లు వెయ్యడం అలవాటు. 2చిట్లు  రాసాను ఒకదాని మీద అబ్బాయికి ఫోన్ చెయ్యమని, ఇంకొక దానిమీద వద్దని రాసాను. చిట్లు ఎప్పుడు ఒకసారి తియ్యాలిగాని  నేను చాలాసార్లు వేసాను, చెయ్యవద్దు అని వచ్చింది. చిట్లు అబద్దము చెబుతున్నాయని రుపాయి కాయిన్ వేసాను, బొమ్మ వస్తే ఫోన్ చెయ్యి బొలుసు వస్తే వద్దు అని 100 సారులు వేసాను. ఒక్కసారికూడా బొమ్మ రాలేదు. ఇక అప్పుడు అనుకున్నా  బాబాకు నా ప్రసాదము నా పుట్టినరోజుకు తీసుకోవడము ఇష్టము లేదు అనిపించింది.   



షిరిడి దర్శనము(live) చుసాను. బాబా ప్రతిసారి నా ప్రసాదము తీసుకుంటావు ఇప్పుడు ఎందుకు తీసుకోవడములేదో నాకు అర్దం కావడములేదు, నాకు చాలా ఏడుపు వస్తుంది అని వేడుకున్నాను. బాబా మీకు ఇష్టము లేకుండా నేను ఏపని చెయ్యను, ప్రసాదము గుడిలోనే ఇస్తాను అనుకున్నాను. కాని బాధ మాత్రము అలానే వుంది. 23 తారీఖున 3గం|| వరకు బాధపడుతునే వున్నాను. 3.30 గం||లకి నా స్నేహితురాలికి ఫోన్ చేసాను. 11 డిసెంబర్ 2014 నా స్నేహితురాలి పెళ్ళి జరిగింది.నేను వెళ్ళలేదు, తనకి చాలా కోపము వచ్చి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తియ్యలేదు. అలాంటి అమ్మాయి 3.45గం||లకు ఫోన్ చేసి అంజలి నేను షిరిడి వెళ్ళుతున్నాను నువ్వుకూడా వస్తావా అని అడిగింది. నాకు మాటలు రాలేదు. నేను షిరిడి రానుగాని నా ప్రసాదము తీసుకొని వెళ్ళతావా? అని అడిగాను. దానికి వెంటనే నా స్నేహితురాలు అందుకే ఫోన్ చేసాను, తప్పకుండా తీసుకోని వెళ్ళతాను, ప్రసాదము తీసుకోవడానికి నా భర్త వస్తారు అని చెప్పింది. నా భర్తకూడా బాబాకు బాగా భక్తులు అని చెప్పింది. అప్పుడు నా సంతోషాన్ని మాటలలో చెప్పలేను. నేను అనుకుంటూ ఉండేదాన్ని సంతోషము వస్తే కళ్ళనిండా నీళ్ళు ఎందుకు వస్తాయి కాని అవి ఆనందబాష్పాలు. బాబా నాకు ఇది చాలు, మీరు మీ భక్తులని వదులుకోరని తెలుసు. ప్రసాదము చేసి ఇచ్చాను. మా గుడిలో కూడా నాలుగు ఆరతులికి ప్రసాదము చేసి ఇచ్చాను. అబ్బాయికూడా షిరిడి నుంచి పుట్టినరోజు ఆశ్శీసులు పంపించాడు.   

బాబా నా పుట్టినరోజున మీ ఆశ్శీసులు కావాలి. మనగుడిలోనే ఏవరో తెలియనివాళ్ళు నన్ను ఆశ్శీర్వదించాలి అనుకున్నాను. కాని నేను కొత్తబట్టలు వేసుకోలేదు, ఎప్పుడు నేను గుడిలో ప్రసాదము పంచుతాను. ఆరోజు సాయంత్రము ఆరతికి గుడికి వెళ్ళి ప్రసాదము పంచిపెడుతున్నాను. ఎవరో తెలియని అమ్మాయి నన్ను ఆశ్శీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. 4 సంవత్సరములలో నేను ఎప్పుడు అమ్మాయిని చూడలేదు. నేను ఆశ్చర్యపోయాను మీకు ఎలా తెలుసు అని అడిగాను. ఏమో నాకు తెలియదు బాబాను చూసి, మిమ్మలిని చూడగానే నాకు చెప్పాలి అనిపించింది. గుడిలో చాలా మంది ప్రసాదము పంచిబెడుతున్నారు కాని ఏవరికి చెప్పని ఆశ్శీస్సులు అమ్మాయి నాకు చెప్పింది. ఇది బాబా అనుగ్రహమే కదా! బాబా నాకు ఇది చాలు అనుకున్నాను. అందరికి మీ ఆశ్శీస్సులు వుండాలి అని కోరుకుంటున్నాను. శ్రద్ద, భక్తి, నమ్మకము వున్నచోట బాబా తప్పకుండా ఉంటారు. స్వార్దము ఉన్నచోట బాబా ఉండరు.    



నేను మీ అందరిని కోరుకుంటున్న బాబాను మనస్పూర్తిగా కోరుకుంటే తప్పకుండా మన కోరికలని నెరవేరుస్తారు, కష్టాలు తొలగిస్తారు. బాబాగారు నాకు కలలో చెప్పారు కదా! స్వార్దముగా వుండవద్దు, అందరు కలిసిమెలిసి వుండండి. గుడిలో సేవ అనేది అందరికి ఇవ్వండి, ఒకవేళ సేవ దొరకపోయిన బాధపడకండి బాబాను చూసిన అది కూడా సేవ అవుతుంది. అందరికి బాబా ఆశ్శీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.



ఇట్లు

అంజలి.