Total Pageviews

Wednesday, March 12, 2014

సద్గురు సాయినాథునికి శతకోటి వందనాలు ....

జీవితంలో అనుక్షణం ఏవో కష్టనష్టాలు ఎదురౌతుంటాయి. అందుకే సంసారాన్ని సాగరంతో పోల్చారు. నిరంతర అలల తాకిడిని పోలిన చీకూచింతలు ఉంటాయి. ఆటుపోట్ల సమస్యలు వస్తుంటాయి. తిమింగలాల్లాంటి పెద్ద ఆపదలు పొంచి ఉంటాయి. తుపానుల్లాంటి ఆకస్మిక ప్రళయాలు ముంచుకొస్తుంటాయి.
అంతమాత్రాన జీవితం నుండి పారిపోలేం. పలాయనవాదం పనికిరాదు. ఇలాంటి ఆపద సమయాల్లో భక్తులు సాయిబాబాను స్మరించుకుంటారు. బాబా భక్తసులభుడు. వెంటనే అనుగ్రహిస్తాడు. నమ్మినవారికి అండగా నిలుస్తాడు. కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. కష్టాలనుండి గట్టెక్కిస్తాడు.
ఆపదల నుండి బయటపడిన భక్తులకు బాబా పట్ల ఎనలేని విశ్వాసం కుదురుకుంటుంది. ఇక మనసునే మందిరంగా చేసుకుని బాబాను ప్రతిష్టించుకుంటారు. సాయిబాబా లేని ప్రదేశం లేదు. అడుగడుగునా బాబా లీలలు కనిపిస్తాయి. అణువణువునా బాబా రూపం అనుభూతికొస్తుంది. అందుకే బాబా మనతోనే ఉన్నాడని నమ్ముతూ ముందుకు సాగాలి. ఆయన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తాడు. సమస్యలను పరిష్కరించుకునే తెలివితేటలు ఇస్తాడు. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ప్రసాదిస్తాడు.

సాయిబాబా నామస్మరణ అహంకారాన్ని అణచివేస్తుంది

సాయిబాబా నామస్మరణ అహంకారాన్ని అణచివేస్తుంది. ఈర్ష్యాసూయలను నశింపచేస్తుంది. క్రమశిక్షణ అలవరుస్తుంది. మన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేందుకు దోహదపడుతుంది. సాయిబాబా, భక్తిశ్రద్దలతో ప్రార్థించమని, తనను మనసులో నిలుపుకోమని చెప్పాడు. జపాలు, తపాలు, పూజలూ, మంత్రాలూ అవసరం లేదని, సదా తనను తలచుకుంటే చాలని చెప్పాడు. పూజలు, దండకాల కంటే మాలిన్యంలేని మనసే ప్రధానం అని నొక్కి చెప్పాడు. సాయిబాబాకు ఆడంబరాలు, ఆర్భాటాలతో పని లేదు. నిండైన మనసు చాలు.

Sunday, March 9, 2014

సాయి ప్రార్ధన

(ప్రతిరోజు ఉదయం బాబా విగ్రహం ముందుగాని, పటం ముందుగాని, దీపం వెలిగించి, బాబా అష్టొత్తర శతనామావళిని చదవండి. తరువాత శ్రధ్ధా,భక్తులతో ఈ ప్రార్ధన చేయండి. బాబా మీకు రోజంతా సుఖ సంతోషాలను కలుగచేస్తారు.)

"సాయిబాబా నేను నీవద్దకు వచ్చా
ను. నీ పవిత్ర పాదాలవద్ద నాశిరసునుంచి నీకు సర్వశ్యశరణాగతి చేస్తున్నాను. మంచికి, చెడుకి భేదమెరుగలేను. నువ్వు సర్వత్రా నిండివున్నావు. సర్వ శక్తిమంతుడవు. నన్నెల్లపుడూ సంతోషంగా ఉంచేది, నాకు అర్హమైనది ఏదో అదే అనుగ్రహించు. జీవితంలో దురదృష్టాన్ని, విచారాన్ని భరించే శక్తి నాకులేదు. యిది మాత్రమే నాకు తెలుసు. నేను, నాకుటుంబం, బంధుమిత్రులు, యింకా ఈ సమాజంలోని వారందరూ కూడా ఒకరిమీద ఒకరు ప్రేమానురాగాలతో సుఖ సంతోషాలతో కలసిమెలసి జీవించాలి. ఇదే నేనెల్లప్పుడూ కోరేది. బాబా నన్నెల్లప్పుడు నీకంటికి రెప్పలా కాపాడు.

నా దైనందిన జీవితంలో నేనెవరికీ హాని తలపెట్టకుండాను, నాకెవరూ హాని తలపెట్టకుండాను వుండేలాగ అనుగ్రహించు. రేయింబవళ్ళు సదా నీ సాయి మంత్రాన్నే జపించే వరమివ్వు. అహంకారం, పగ, ప్రతీకారం యిటువంటి దుష్ట ఆలోచనలు నాదరి చేరకుండా అనుగ్రహించు. నామాటలు ఎవరినీ నొప్పించే విధంగా లేకుండా నన్ను దీవించు.

నీపాదాల వద్ద శరణువేడుకోవడం నేనెన్నటికీ మరువను. గతంలో నేను, తెలిసి గాని తెలియకగాని చేసిన తప్పులను దయచేసి మన్నించు.

సద్గురు సాయినాధా ! సుఖ సంతోషాలతో జీవించేలా నన్ను దీవించు.

ఓం శ్రీసాయిరాం

Saturday, March 8, 2014

Khandoba Mandir (Shirdi) :-

This temple is of great significance and trails back to the life of Sai Baba. This temple was the first place where Baba halted on his visit to Shirdi, along with the wedding party of Chand Bhai Patil and in this very place Baba got his name. On seeing him dressed as a fakir, a temple priest named Mhalsapati called him out as ‘Ya Sai’ meaning ‘Come Sai’. Since then, the name Sai Baba continues to reverberate in the land which became his own.

Tuesday, March 4, 2014

బ్రహ్మ జ్ఞానము

ఒకసారి ఒకతను సాయివద్దకు వచ్చి బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించమని వేడుకొనగా సాయి బ్రహ్మమును(ఆత్మ దర్శనము) చూచుటకు(పొందుటకు) ముఖ్యమైన విషయములను ఈ క్రింది విధముగా చెప్పెను.
- బ్రహ్మమును చూచుటకు పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు అహంకారములను సమర్పించవలెను.
- సుఖములను లక్ష్య పెట్టరాదు.
- కీర్తి విషయములందు అనాసక్తుడై మెలగవలెను.
- దృష్టిని లోనికి పంపి లోనున్న ఆత్మనే ధ్యానించవలెను.
- తప్పుడు మార్గము వదలవలెను.
- సత్యములు పలుకవలెను.
- వేదాంత విషయములు ఎంచుకోవలెను.
- మనస్సును చంచలము కానివ్వక జాగ్రత్త పడవలెను. అనగా మనస్సును స్వాధీనమునందుంచుకొనవలెను.
- విధులను తృప్తిగా ఫలాపేక్షరహితముగా నిర్వర్తించవలెను.
- అహంకారము విడువవలెను.
- మనస్సు కోరికలను విడిచిపెట్టి దేహమే నేనను భ్రమను కూడా వదలవలెను. లేని యెడల బంధములో చిక్కు కొనవలసి వచ్చును.
- ఆత్మ సాక్షాత్కారము పొందిన గురువు సహాయము యిందులకు చాలా అవసరము.
- భగవంతుని కటాక్షము ఎంతో అవసరము.

Monday, March 3, 2014

నవవిధ భక్తీ మార్గాలు

భగవంతునిని చేరేందుకు అంటే ఆ పరమాత్మలో ఐక్యమయ్యేందుకు సాయిబాబా తెలిపిన మార్గాలే ఈ నవవిధ భక్తీ మార్గాలు. ఈ నవవిధ భక్తీ మార్గాలలో దేనినైన సరే ఒకదానిని తీసుకొని సరిగా అవలంబిస్తే ఆ పరంధామున్ని చేరడం ఖాయమని ఆయన ఎన్నో సార్లు అయన తన భక్తులతో వివరించారు.
సాయిబాబా తన భక్తులతో ఈ విధంగా చెప్పాడు. “భగవంతుని అనుగ్రహము సంపాదించే నవవిధ భక్తి మార్గాలను తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెంది ఆ భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. నవవిధ భక్తి మార్గాలు అంటే ఏవో కాదు. i.శ్రవణము ii.కీర్తనము iii.స్మరణము iv.పాదసేవనము v.అర్చనము vi.నమస్కారము vii.దాస్యము viii.సఖ్యత్వము ix.ఆత్మనివేదనము.”

1. శ్రవణము : listening to his exploits – శ్రవణము అంటే భగవంతుని గురించి మరియు ఆయన లీలావిషేసాల గురించి వింటూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికతో గడపడం.
2. కీర్తనము : chanting his name and reciting hymns in his praise – కీర్తనం అంటే భగవంతుని గురించి ఆయన తత్త్వం గురించి కీర్తించడం అంటే ఆయనే ఈ సమస్త లోకాలకు పాలకుడు అని ఆయన నామాన్ని కీర్తిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికతో గడపడం.
౩. స్మరణము : remembering him – స్మరించడం అంటే ఆ దేవదేవుడిని నిరంతరం మన మనస్సులో స్మరిస్తూ సంపూర్ణంగా అధ్యత్మికతో జీవించడం.
4. పాదసేవనము : serving his lotus feet – పాదసేవనం అంటే ఆ భగవంతునికి నిర్మలమైన మనస్సుతో నువ్వు సమర్పించే ప్రతిది ఆయన పాదాలకు సమర్పించడం.
5. అర్చనము : worshipping him – అర్చనము అంటే నువ్వు చేసే ప్రతి పనిని ఆయనకు సమర్పిస్తూ ఉండడమే. దీనినే భగవంతునికి అర్చన చేయడం అంటారు.
6. నమస్కారము : praying obeisance to him – నమస్కారము అంటే భగవంతునిని సంపూర్ణంగా మనస్పూర్తిగా నమస్కరించడం. ఆయనను మనసార ప్రార్ధించడం.
7. దాస్యము : practicing the role of his servant – దాస్యము అంటే భగవంతుడు ఒక అధికారిగా నువ్వు ఆయన సేవకుడిని అని భావిస్తూ జీవితాన్ని సంపూర్ణంగా అధ్యాత్మికంతో గడపడం.
8. సఖ్యత్వము : looking upon him as an intimate friend – సఖ్యత్వము అంటే ఆయన నీకు ఒక మిత్రుడుగా భావిస్తూ నీకు మరియు ఆయనకు ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకొని జీవించడం.
9. ఆత్మ- నివేదనము : surrending oneself totally to him – ఆత్మ నివేదనము అంటే సంపూర్ణ శరణాగతి అంటే సమస్తము నువ్వే నాది అంటూ ఏది లేదు అని జరిగే ప్రతిది నీ మూలంగానే జరుగుతుందని, నీకు నువ్వు సంపూర్ణంగా శరణాగతి కావడమే.
ఈ విధంగా మనం సాయిబాబా చెప్పిన నవవిధ భక్తి మార్గాలను తెలుసుకొని వాటిలో ఏదైనా ఒక మార్గమును మనస్పూర్తిగా అనుసరించిన ఎడల మనలను ఆయన తన దగ్గరికి చేర్చుకుంటాడు.