Wednesday, April 30, 2014

బాబాగారు న్యాయాన్ని గెలిపించారు - ------------------అంజలి.

 


బాబాగారు న్యాయాన్ని గెలిపించారు

అందరికి నా నమస్కారాలు. బాబాగారు తమ భక్తులను ఎంత బాధపెట్టిన అంతకంటే ఎక్కువ సంతోషాన్ని ప్రసాదిస్తారు. ఈలీల చదివితే మీకే అర్దం అవుతుంది.

మేము ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి మాగుడిలో ఫ్రెండ్స్ అందరము కలిసి షిరిడి వెళ్ళతాము. సంవత్సరము శ్రీరామనవమి 2014 ఏప్రియల్7,8,9( సోమ,మంగళ,బుధవారము) వచ్చింది. మేము ఆదివారము షిరిడికి వెళ్ళాము. ఆదివారము రోజున బాబాగారు మమ్మలిని అన్ని ఆరతులకు పిలిపించుకున్నారు. మాకు అసలు అర్దం కాలేదు. ఎంతమంది జనము వున్నారంటే చెప్పలేము. పల్లకీలు తీసుకొని చాలామంది వచ్చారు. నేను ఇక్కడ నుంచి బయలుదెరేటప్పుడు అనుకున్నాను సెలవులు ఉండవు కదా! జనం తక్కువ వుంటారు అనుకున్నాను కాని చెప్పలేని జనము ఉన్నారు. మేము వెళ్ళలేము అనుకున్నాము కాని బాబాగారు అన్ని ఆరతులకు ముందే దర్శనము ఇచ్చారు. రాత్రి(శేజ్)ఆరతి ఎంత బాగుందో మాటలలో చెప్పలేము. 2013 సంవత్సరములో బాబా గ్రేప్స్ వేసి ఆశీర్వదించారు.   ఇప్పుడు గ్రేప్స్ కట్టలేదు, పువ్వులు కూడా తక్కువ కట్టారు కాని మీ ఆశీస్సులు నాకు తెలియాలి. అందుకే నేను మిమ్మలని ఒక పిచ్చి కోరిక కోరుకుంటున్నాను, నా శరీరము నుంచి రక్తము కారి భూమిమీద పడాలి. బాబా నా కోరిక నెరవేరుస్తారు కదా!

మంగళవారము శ్రీరామనవమి రోజు కాకడ ఆరతికి వెళ్ళాలంటే ముందురోజు సోమవారము మధ్యహ్నాము 2 గం||లకు లైనులో నుంచున్నాము. 8మంది ఎక్కడికి వెళ్ళలేదు. సెక్యూరిటి మమ్మలిని తిట్టాడు ఎందుకు ఇక్కడ ఉన్నారని? మేము రేపు కాకడ ఆరతి కోసము నుంచున్నాము అని అన్నాము దానికి సెక్యూరిటి మమ్మలని తిట్టాడు కాని మేము వెళ్ళలేదు. సాయంత్రము 6 గం||లకు చాలామంది వచ్చేసారు, మమ్మలని తోసేసి నిలుచున్నారు. మాకు వాళ్ళకి గొడవలు జరిగాయి. వాళ్ళు రాజీకీ వచ్చారు. సరే మీరు ముందు నుంచోండి అని అన్నారు. 8 గం||లకు చెప్పలేని జనము వచ్చేసారు. సెక్యూరిటీకి అందరిని లైనులో నుంచోపెట్టడానికి చాలా కష్టం అయింది. అందరు తోసుకుంటున్నారు. సెక్యూరిటికి ఏమిచెయ్యలో అర్దం కాలేదు.దర్శనము లైను మార్చాడు వేరేవైపు నిలుచోమని చెప్పాడు. అందరు పరుగులు తీస్తూ వెళ్ళారు. అబ్బాయిలు ఎక్కువుగా ఉండటము వలన మేము వెళ్ళలేకపోయాము. మేము మధ్యలోనే వుండిపోయాము. సెక్యూరిటి మావైపు నుంచి దర్శనానికి పంపుతాను అన్నాడు. అప్పటికే మాఫ్రెండ్స్ అందరము విడిపోయాము. 10.30 గం||లు అయ్యింది ఇక లైనులో పంపడానికి సెక్యూరిటీ వచ్చాడు అందరు లైనులో వెళ్ళండి అన్నాడు. కాని అందరి తోసివేసారు మేము సువ్వల పక్క, మధ్యలో ఉండిపోయాము. ఒక్కసారిగా లైను వదిలేపాటికి మేము సువ్వల మీద పడేవాళ్ళము, కాని ఆపుకున్నాము. చాలమందికి దెబ్బలు తగిలాయి.           మాఫ్రెండ్ కాళ్ళుమీద సువ్వలచక్రం ఎక్కింది మేము బాగా నలిగిపోయాము, అందరము విడిపోయాము. ముగ్గురము మాత్రము కలిసివున్నాము. మనము ఆరతికి వెళ్ళవద్దు అనుకున్నాము. అందరు మమ్మలని తోసివేసారు మేము పడిపోయాము. ఏడుస్తూ అక్కడే ఉండిపోయాము. నేను సువ్వల మీద పడిపోయాను నా కాళ్ళు కోసుకుపోయి రక్తము వచ్చింది.అందరు వెళ్ళిపోయారు అప్పుడు సెక్యూరిటి మమ్మలిని లైనులో వెళ్ళామన్నాడు. మేము రామని ఏడుస్తూ ఉన్నాము.వెరేవాళ్ళు చాలమంది వచ్చారు, ఏమి అయ్యిందని అడిగారు. రక్తము కారడము సెక్యూరిటి వాళ్ళు చూసారు హాస్పటలకి తీసుకుని వెళ్ళతామని అన్నారు. నేను రాను అని అన్నాను. ఏడుస్తునే ఉన్నాను. 108 వచ్చింది, అయినా నేను రాను అన్నాను. ఇక్కడ ఆడపిల్లకి గౌరవమనేది లేదు, మేము మధ్యానము 2గం||లకు నిలుచున్నాము. మమ్మలని తోసేసారు. షిరిడిలో బాబా దగ్గరే దగ్గరే న్యాయం లేదు, ఇంక ఎక్కడ దోరుకుతుంది న్యాయం చెప్పండి. నేను చాలాసేపు ఏడ్చాను నాకు న్యాయం కావాలని. న్యాయం లేనిచోట బాబా ఉండరు అయితే షిరిడిలో బాబాలేరు అంటూ ఏడ్చాను. అందరు నన్ను అలా అనవద్దు అన్నారు. పూనే నుంచి ఎవరో ఆంటీవాళ్ళు మాకు అండగా నిలిచారు.మీకు మేము న్యాయం చేస్తాము అని అన్నారు. అందరు అడిగారు ముందుగా సెక్యూరిటి వాళ్ళని తీయించేయండి, వాళ్ళు ఆడపిల్లలని చూడకుండా ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి తోసేస్తారు. మమ్మలని సువ్వలమీద తొసేసారు అందుకే వాళ్ళని తీసేయ్యాలని నేను గట్టిగా అరవడము మొదలుపెట్టాను. సెక్యూరిటి వాళ్ళతో మేము మాట్లడతాము, ఇంకొకసారి ఇలా జరగనివ్వమని అన్నారు. ఆంటీవాళ్ళు మేము వున్నాము మీకు న్యాయం చేస్తాము అని చెప్పారు. హాస్పటలకు తీసుకొని వెళ్ళతామని అన్నారు, వద్దు నాకు బాబా విభూతి కావాలి అని చెప్పాను. సెక్యూరిటి నాదగ్గర ఉన్నదన్నాడు, మాకు ఇచ్చారు. నాకు బొట్టుపెట్టి నోటిలో వేసి నాకాళ్ళు మీద కూడా వెయ్యమన్నాను. నిజముగా చెబుతున్నాను నేను అప్పటిదాక కాళ్ళు కదపలేకపోయను. విభూతి రాయగానే నాకాళ్ళు కొంచెము కదిపాను. నాకు ఏమివద్దు అన్నాను, మమ్మలిని కాకడ ఆరతికి ముందు పంపుతాము అని చెప్పారు. అందరికంటే ముందే కుర్చోపెట్టారు. న్యాయం చాలు. చుసారా! న్యాయమే గెలిచింది. నేను లైనులో నుంచున్నా నన్ను ఎవరు తొక్కలేదు. నాకు నొప్పి కూడా లేదు. చుసారా! బాబాగారు నాకోరిక నెరవేర్చారు.


మీ అందరిని కోరుకునేది ఒక్కటే అమ్మాయిలకి గౌరవము ఇవ్వండి. అమ్మాయిల మనసు చాలా సున్నితముగా వుంటుంది గనుక బాధపెట్టవద్దు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిల జీవీతాలతో ఆడుకుంటున్నారు. నేను అబ్బాయిలదే తప్పు అనడం లేదు, ఈమధ్య అమ్మాయిలు కూడా చాలాతప్పులు చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిల వలన మంచి అమ్మాయిలు కూడా నాశనము అయిపోతున్నారు. మిమ్మలని వేడుకుంటున్నాను అందరము కలిసి బ్రతుకుదాము, ఒక తల్లి బిడ్డలలాగ కలిసి ఉందాము. ఇది చూసి బాబాగారు కూడా చాలా సంతోషిస్తారు. కలిసి ఉంటారు కదా! బాబా ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను.

 ఇట్లు

అంజలి.